అమ్మకానికి యాహూ ఇంటర్నెట్..

Written By:

యాహూ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన యాహూ దిగ్గజాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌తో పోటీ ప‌డ‌లేక డీలా ప‌డి ఇంట‌ర్నెట్ బిజినెస్‌ని అమ్మకానికి పెట్టేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. యాహూ సంస్థ తన ఇంటర్నెట్ వ్యాపారాన్ని విక్రయించే అవకాశాలున్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కంపెనీ బోర్డు సమావేవేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అమ్మకాల అంశంపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది.

Read more : మానవసేవే మాధవసేవ అంటున్నకోట్లాధిపతులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను

యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఈవారం జరిగే కంపెనీ డెరైక్టర్ల బోర్డ్‌లో ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడగలదని సమాచారం.

యాహూ కంపెనీ భవితవ్యం

యాహూ కంపెనీ భవితవ్యం, ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిసా మేయర్ భవితవ్యంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బోర్డ్ మీటింగ్ జరగనున్నది.

విక్రయించే అవకాశాలున్నాయంటూ

యాహూ సంస్థ తన ఇంటర్నెట్ వ్యాపారాన్ని విక్రయించే అవకాశాలున్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బోర్డ్ సమావేశాలు బుధవారం నుంచి శుక్రవారం వరకూ జరగనున్నాయి.

ఈ సమావేశాల్లో ఆలీబాబా హోల్డింగ్ గ్రూప్‌లో

ఈ సమావేశాల్లో ఆలీబాబా హోల్డింగ్ గ్రూప్‌లో ఉన్న 3,000 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించే విషయం కూడా చర్చకు రానున్నదని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు 7శాతం ఎగిశాయి.

యాహూ కీలక వ్యాపారాలు

యాహూ కీలక వ్యాపారాలు.. యాహూ మెయిల్, న్యూస్, స్పోర్ట్స్ సైట్ల విక్రయానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, మీడియా, టెలికాం కంపెనీల నుంచి మంచి స్పందన లభించగలదని యాహూ భావిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి యాహూ నిరాకరించింది.

ఆమె పనితీరు అంశాల పట్ల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని

కాగా చాలా కాలం గూగుల్‌లో పనిచేసి ఆ తర్వాత యాహూలో చేరిన మరిసా మేయర్‌పై ఆమె పనితీరు అంశాల పట్ల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.

గూగుల్, ఫేస్‌బుక్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న యాహూ

గూగుల్, ఫేస్‌బుక్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న యాహూ ఆమె రాకతో టర్న్‌అరౌండ్ అవగలదన్న అంచనాలు పెరిగిపోయాయి. అయితే మావెన్స్ పేరుతో ఆమె అందుబాటులోకి తెచ్చిన వ్యూహాం సత్ఫలితాలనివ్వలేదు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Rumored Sale of Yahoo’s Internet Arm Sends Stock Soaring
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot