పుకార్లు పుట్టిస్తున్నారు.. నమ్మకండి?

Posted By: Prashanth

పుకార్లు పుట్టిస్తున్నారు.. నమ్మకండి?

 

నోకియా ప్రకటించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘808 ప్యూర్ వ్యూ’ ధర విషయంలో వ్యక్తమవుతున్న పుకార్లను నోకియా వర్గాలు ఖండించాయి. ఫోన్ ఆవిష్కరణ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా నోకియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 41 మెగా పిక్సల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను తొలిగా 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయం చేశారు. ఈ ఫోన్‌లోని ఇమేజింగ్ అల్గోరిథంలను నోకియా, కార్ల్‌‌జిస్ ఆప్టిక్స్‌లు అభివృద్ధి చేసాయి. ఈ ఫోన్‌లను తొలిగా భారత్, రష్యాలలో విక్రయించనున్నారు. ఉత్తమ మొబైల్ డివైజ్ అవార్డును ‘నోకియా ప్యూర్ వ్యూ’ దక్కించుకుంది.

వెబ్ ప్రపంచంలో హల్‍‌చల్ చేస్తున్న పలు నివేదికలు నోకియా ప్యూర్ వ్యూ 808 ధరను రూ.29,999గా ప్రకటించాయి. ఈ రూమర్ పై స్సందించిన నోకియా అధికార ప్రతినిధి ఒకరు ‘ధరకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆ సమాచారం ఖచ్చితమైనది కాదని, ఖచ్చితంగా డమ్మిదని’ స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ నికర ధరను ఆవిష్కరణ సమయంలో మాత్రమే ప్రకటిస్తామని వెల్లడించారు. నోకియా ప్రకటన నేపధ్యంలో ‘నోకియా ప్యూర్ వ్యూ 808’ దర రూ.30,000 పైనే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నోకియా 808 ప్యూర్ వ్యూ ముఖ్య ఫీచర్లు:

4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),

1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

జీపీఎస్ సపోర్ట్,

బ్లూటూత్,

41 మెగాపిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

1400mAh లియాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot