సోనీ నుంచి పెద్దతెర టాబ్లెట్..?

Posted By:

రాబోయే రోజుల్లో ప్రపంచానికి పరిచయం కాబోతున్న పెద్దతెర టాబ్లెట్ డివైస్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. యాపిల్ తన తరువాతి వర్షన్ ఐప్యాడ్‌ను పెద్ద స్ర్కీన్ డిస్‌ప్లేతో పరిచయం చేసే అవకాశముందన్న వార్త ఓ వైపు ఉత్కంఠకు లోను చేస్తేంటే, సోనీకి సంబంధించిన మరో వార్త టాబ్లెట్ ప్రియులను కనువిందు చేస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సోనీ నుంచి పెద్దతెర టాబ్లెట్..?

(ఈ ఫోటోలో కనిపిస్తున్న టాబ్లెట్ మోడల్ ‘సోనీ టాబ్లెట్ ఎస్’. సోనీ పెద్దతెర టాబ్లెట్‌కు సంబంధించిన ఫోటో ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు)

12.9 అంగుళాల డిస్‌ప్లే(రిసల్యూషన్ 3840x2400పిక్సల్స్)తో కూడిన టాబ్లెట్ డివైస్‌ను సోనీ 2015లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ పై రన్ అవుతుందట.

8.6 మిలీమీటర్ల మందంతో కూడిన చాసిస్‌ను కలిగి ఉండే ఈ అతిపలుచని టాబ్లెట్ డివైస్ 8 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో లభ్యమయ్యే అవకాశం ఉందని సదరు రిపోర్ట్ పేర్కొంది. 2015లో అందుబాటులోకి రాబోయే ఈ టాబ్లెట్ ధర 1,000 డాలర్లు పై మాటేనట (మన కరెన్సీ ప్రకారం రూ.60,000 అంతకన్నా ఎక్కువ కావొచ్చు).

యాపిల్ ఉత్పత్తులను తయారుచేసే పెంటగాన్ సంస్థ ఈ సోనీ టాబ్లెట్‌లను ఉత్పత్తి చేయటం విశేషం.

English summary
Rumoured: Sony to build a large tablet, scheduled for 2015. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot