భారీగా పట్టుబడుతున్న నగదు, రేడియోయాక్టివ్ ఇంక్ వాడారా..?

పెద్దనోట్టను రద్ద చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000, రూ.500 నోట్లను మోదీ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో, కొత్త నోట్ల పై అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొత్తగా విడుదలైన రూ.2000 నోట్లలో 'nano GPS chip'లను నిక్షిప్తం చేసారంటూ కొద్ది రోజుల క్రితం పుకార్లు షికార్లు చేసాయి. అదంతా ఉత్త ట్రాష్ అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటంతో, ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగిపోయింది.

భారీగా పట్టుబడుతున్న నగదు, రేడియోయాక్టివ్ ఇంక్ వాడారా..?

Read More : ఇంటర్నెట్ కనెక్షన్ అవసరంలేని 10 ఆండ్రాయిడ్ గేమ్స్

తాజాగా కొత్త నోట్లకు సంబంధించి మరో రూమర్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. కొత్తగా లాంచ్ చేసిన రూ.500, రూ.2000 నోట్ల పై 15 ప్రోటాన్లు, 17 న్యూట్రాన్లుతో కూడిన పీ32 అనే రేడియోయాక్టివ్ ఐసోటోప్ ఇంక్ ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలోవిపరీతంగా షేర్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీగా పట్టుబడుతున్న నగదు, రేడియోయాక్టివ్ ఇంక్ వాడారా..?

నోట్లలో ఇటువంటి సాంకేతికతను వినియోగించటం కారణంగానే ఢిల్లీ, చెన్నై, వెల్లూర్, బెంగుళూరు, పూణే వంటి ప్రాంతాల్లో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడిందని ఈ రూమర్స్ చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ ప్రచారాలను పూర్తిగా కొట్టిపారేస్తోంది. కొత్త నోట్లలో రెగ్యులర్ గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లు తప్ప ఎటువంటి అదనపు ఫీచర్లను జోడించలేదని చెబుతోంది.

Read More : మీ ఫోన్‌లో మెమరీ కార్డ్ ఉందా..? ఇవి తెలుసుకోండి

English summary
Rumours of ‘radioactive ink in the new currency notes’ doing rounds of the internet. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting