రష్యా సైబర్ అటాక్, విరుచుకుపడుతున్న అమెరికా, బ్రిటన్‌ !

Written By:

United States, Britain దేశాలు ఇప్పుడు రష్యా మీద విరుచుకుపడుతున్నాయి. కంప్యూటర్ల మీద రష్యా సైబర్ అటాక్ చేసిందని ఆరోపిస్తున్నాయి. కాగా ఈ గ్లోబల్‌ సైబర్‌ దాడులపై అమెరికా, బ్రిటన్‌లు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశాల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా సైబర్‌ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి. 2015లో మొదలైన ఈ సైబర్‌ అటాక్స్‌ మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని, ఈ దాడుల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించాయి.

రష్యా సైబర్ అటాక్, విరుచుకుపడుతున్న అమెరికా, బ్రిటన్‌ !

అడ్వాన్స్డ్ స్పెయింగ్ సిస్టంతో ప్రధాన స్థావరాలపై రష్యా సైబర్ దాడి చేసే అవకాశం ఉందని ఇది మరింతగా ఆందోళన కలిగిస్తుందని వాషింగ్టన్, లండన్ జాయింట్ అలర్ట్గా రష్యా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. గతేడాది 'నాట్‌పెట్యా' అనే సైబర్‌ దాడిలో ఉక్రెయిన్‌ కకావికలమైన విషయం తెలిసిందే. కేవలం ఉక్రెయిన్‌కే పరిమితం కానీ ఈ దాడిలో మరికొన్ని దేశాలు కూడా నష్టాలను చవి చూశాయి. ఈ దాడులను కూడా రష్యానే ప్రోత్సహించిందని అమెరికా, బ్రిటన్‌లు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యా, సిరియా ప్రభుత్వ సేనలకు వ్యతిరేకంగా సిరియాలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు దాడుల చేసిన విషయం తెలిసిందే.

సరికొత్తగా Nokia X, లీకయిన ఫీచర్లు, లాంచింగ్ తేదీ, నోకియా3కి ఓరియో అప్‌డేట్‌

ఈ ఘటన అనంతరం బ్రిటన్‌ దేశంలో పెద్ద ఎత్తున హ్యాకింగ్‌ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజా దాడులు సైబర్‌వార్‌కు తెరతీస్తాయనే భయాందోళనలు బ్రిటన్‌ వ్యాప్తంగా వ్యాపించాయి. సైబర్‌ అటాక్‌ జరిగిన తర్వాత ఎవరు? ఎక్కడి నుంచి ఆ దాడి చేశారన్న విషయాన్ని గుర్తించడం అసాధ్యంగా మారింది. దీంతో అసలు దోషులు ఎవరో తెలుసుకోలేక బాధిత దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

కాగా, అమెరికా, బ్రిటన్‌ల హ్యాకింగ్‌ ఆరోపణలను రష్యా ఖండించింది. ఆయా దేశాలపై సైబర్‌ దాడికి ప్రోత్సహించామని అనడంలో వాస్తవం లేదని పేర్కొంది. కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడం వెనుక రష్యా హస్తముందని అమెరికా ఇంటిలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

English summary
US and UK accuse Russia of launching cyber attack campaigns on government networking equipment around the globe More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot