వచ్చే ఏడాది ఐఫోన్‌ను బ్యాన్ చేయవచ్చు.. ఎందుకో తెలుసా?

|

రష్యన్ దిగువ సభ ఆమోదించిన కొత్త చట్టం ప్రకారం తమ దేశంలో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లను అమ్మకాలు చేయడానికి రష్యన్ సాఫ్ట్‌వేర్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఒక వేల అలా ఇన్‌స్టాల్ చేయని ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లను మరుసటి సంవత్సరం నుండి నిషేధించవచ్చని ఫోనెరెనా నివేదిక తెలిపింది.

చట్టం
 

రష్యాలో ఈ చట్టం జూలై 2020 నుండి అమలులోకి రానుంది. ఈ రష్యన్ సాఫ్ట్‌వేర్‌తో రాని స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు మరియు స్మార్ట్ టెలివిజన్లను నిషేధిస్తున్నట్లు రష్యన్ ప్రభుత్వం ప్రకటించింది. వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel Recharge Queue ప్రీపెయిడ్ ప్లాన్స్ ... కొంత కాలం కొత్త ధరకు గుడ్ బై

రష్యా

రష్యాలో అమలు చేయనున్న ఈ కొత్త చట్టం ఫలితంగా ఈ నియమాలను ఆపిల్ పాటించకపోతే కనుక తమ దేశంలో ఐఫోన్‌ను నిషేధించే అవకాశం ఉంది అని రష్యన్ పత్రికలు తెలిపాయి. మాక్బుక్ , ఆపిల్ వాచ్ వంటి ఉత్పత్తులతో పాటు కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం నుండి వస్తున్న ఇతర ఉత్పత్తులకు కూడా ఈ కొత్త చట్టం నియమాలు వర్తిస్తాయి.

సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!

స్థానిక రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని

ఈ చట్టం స్థానిక రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచే లక్ష్యంతో ఉన్నట్లు బిబిసి నివేదిక పేర్కొంది. చట్టం ప్రకారం రష్యాలో తమ ఎలక్ట్రానిక్స్‌ను విక్రయించే కంపెనీలు తమ సొంత సాఫ్ట్‌వేర్‌తో పాటు రష్యన్ "ప్రత్యామ్నాయాలను" ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. అప్పుడే వారు తమ పరికరాలను రష్యాలో విక్రయించగలరు.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు రూ.100 లోపు

ఒలేగ్ నికోలాయేవ్
 

కొత్తగా అమలు చేసిన ఈ చట్టం వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశాలను విలేకరులకు వివరించడానికి చట్టాన్ని అమలుచేసిన వారిలో ఒకరైన ఒలేగ్ నికోలాయేవ్ ఇలా అన్నారు "దేశంలో ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసినప్పుడు వాటిలో ముందే ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్ లు కూడా ఉంటాయి. అందులో ఎక్కువగా వెస్టరన్ కంపెనిలకు (పాశ్చాత్యమైనవి) సంబందించిన వివరాలతో స్థాపించబడి ఉంటాయి. సహజంగానే ఒక వ్యక్తి వాటిని చూసినప్పుడు తమ దేశం యొక్క ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవని అనుకోవచ్చు. ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్ లతో పాటు రష్యన్ కంటెంట్ యాప్ లను కూడా వినియోగదారులకు అందిస్తే వారికి ఎంచుకునే హక్కు ఉంటుంది "అని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థకు (బిబిసి) తెలిపారు.

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

RATEK

ఈ చట్టం ఫలితంగా కొన్ని అంతర్జాతీయ కంపెనీలు రష్యన్ మార్కెట్ నుండి నిష్క్రమించవలసి ఉంటుందని అసోసియేషన్ ఆఫ్ ట్రేడింగ్ కంపెనీలు మరియు ఎలక్ట్రికల్ హౌస్‌హోల్డ్ అండ్ కంప్యూటర్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (RATEK) నివేదించారు. ఎందుకంటే ప్రస్తుతం విక్రయించే అన్ని గాడ్జెట్‌లలో రష్య తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాదు .

Most Read Articles
Best Mobiles in India

English summary
Russia Might Ban iPhone Sales From The Next Year: Read On To Find Reasons

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X