Home
News

iPhone XS కొనేందుకు ఇతను చేసిన ప్రయత్నం చూస్తే నవ్వాపుకోలేరు

గతంలో ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఈ అభ్యర్థి నాణేలతో వెళ్లిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

గతంలో ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఈ అభ్యర్థి నాణేలతో వెళ్లిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది అప్పట్లో సంచలనం అయింది కూడా. అలాగే ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్న వారి నుంచి రకరకాల పిచ్చి పనులను చేసిన వారిని చూశాము. అయితే తాజాగా ఆపిల్‌ ఎక్స్‌ఎస్‌ని సొంతం చేసుకోవడానికి ఈ వ్యక్తి చేసిన పనిని చూస్తే నవ్వాగదు. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఈ సారి ఎన్నికలకు కాకుండా ఐఫోన్ ఎక్స్ఎస్ కొనేందుకు అతను కాయిన్స్ ను బాత్‌టబ్‌లో తీసుకెళ్లాడు. న్యూస్ పూర్తి వివరాల్లోకెళితే..

iPhone XSని కొనుగోలు చేసేందుకు....

iPhone XSని కొనుగోలు చేసేందుకు....

రష్యాకు చెందిన స్వ్యాతోస్లావ్ కోవాలెంకో iPhone XSని కొనుగోలు చేసేందుకు రష్యాలోని మాస్కోలో గల ఆపిల్ స్టోర్ లోకి వెళ్లాడు. వెళుతూ ఈ ఐఫోన్‌ను కొనడానికి అతడు లక్ష రష్యన్‌ రూబెల్స్‌ను (రూ. 1,08,000) నాణేల రూపంలో సేకరించాడు. అలా సేకరించిన కాయిన్స్‌ అన్నింటినీ బాత్‌టబ్‌లో కుమ్మరించాడు.

ఆ బాత్‌టబ్‌ బరువు 350 కేజీలకు చేరింది....

ఆ బాత్‌టబ్‌ బరువు 350 కేజీలకు చేరింది....

దీంతో ఆ బాత్‌టబ్‌ బరువు 350 కేజీలకు చేరింది. స్నేహితుల సాయంలో దాన్ని కారులో పెట్టించి ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ప్రముఖ షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లాడు.ఆ మొత్తం లెక్కేస్తే 1,400 డాలర్లతో సమానం. వాటితో ఐఫోన్ ఎక్స్ఎస్ 256 జీబీ వేరియంట్ కొన్నాడు ఆ రష్యన్ యువకుడు.

ఇలాంటి విచిత్ర నగదు చెల్లింపును స్వీకరించరు....

ఇలాంటి విచిత్ర నగదు చెల్లింపును స్వీకరించరు....

సాధారణంగా షాప్‌ నిర్వాహకులు ఇలాంటి విచిత్ర నగదు చెల్లింపును స్వీకరించరు. కానీ ఈ దుకాణాదారునికి బాగా సమయం, ఓపిక ఉన్నట్లుంది. ఆ కాయిన్స్‌ అన్నింటినీ లెక్కించి ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 256 జీబీ మోడల్‌ను అందించాడు.

ఇంటి దగ్గర బాత్‌టబ్‌లో కాయిన్స్ నింపడం దగ్గర్నుంచి....

ఇంటి దగ్గర బాత్‌టబ్‌లో కాయిన్స్ నింపడం దగ్గర్నుంచి....

కాగా ఇంటి దగ్గర బాత్‌టబ్‌లో కాయిన్స్ నింపడం దగ్గర్నుంచి... ఆపిల్ స్టోర్‌లో అడుగు పెట్టేవరకు అన్ని దృశ్యాలను వీడియో తీశారు. మాల్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకున్నా 350 కిలోల బరువున్న బాత్‌టబ్‌ను ఆపిల్ స్టోర్‌లోకి తీసుకెళ్లాడు.

ఆ కాయిన్స్ ఇచ్చి ఐఫోన్ ఎక్స్ఎస్ సొంతం చేసుకున్నాడు...

ఆ కాయిన్స్ ఇచ్చి ఐఫోన్ ఎక్స్ఎస్ సొంతం చేసుకున్నాడు...

వారికి ఆ కాయిన్స్ ఇచ్చి ఐఫోన్ ఎక్స్ఎస్ సొంతం చేసుకున్నాడు. ఆ తరవాత బాత్‍టబ్‌లో కాయిన్స్‌తో వెళ్లిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Man goes to buy iPhone XS with bathtub full of coins. See what happens next more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X