సమాధిగా మారిపోయిన ఐఫోన్, అసలేంటి దీని కధ ?

  సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ అందరూ పడి చచ్చిపోతుంటారు. దానికోంసం చేయరాని పనులను కూడా చేశారనే వార్తలు విన్నాం. అయితే ఇక్కడ మీరు చదివే స్టోరీ చాలా విచిత్రమైన స్టోరీ..ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ సమాధిగా మారిపోయింది.ఐఫోన్ సమాధిగా మారిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా..అవును ఓ తండ్రి తన కూతురు జ్ఙాపకార్థం ఐఫోన్ ఆకారంలో సమాధిని నిర్మించారు. ఈ సమాధి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కథ పూర్తి వివరాల్లోకెళితే..

  ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.32 వేలు, అమ్మేది మాత్రం లక్షా నలభై వేలకి !

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  కూతురు కోసం ఓ తండ్రి ..

  రష్యాలో ఆయిల్ సిటీగా పేరుగాంచిన Ufaలో కూతురు కోసం ఓ తండ్రి ఈ సమాధిని నిర్మించారు.రష్యాలోని Rais Shameev అనే వ్యక్తి తన కూతురు Rita చనిపోవడంతో ఆమె జ్ఙాపకార్థం ఈ సమాధిని ఇలా డిజైన్ చేశారు.

  అనుకోని వ్యాధితో చనిపోవడంతో..

  25 ఏళ్ల Rita అనుకోని వ్యాధితో చనిపోవడంతో ఆ మరణం తండ్రిని కలచివేసింది. ఐఫోన్ అంటే అమితంగా ఇష్టపడే తన కూతురుకు ఏదైనా జ్ఙాపకం ఇవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ఇలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

  ఐఫోన్ లో డిస్ ప్లే గా ఆయన కూతురు ఫోటో..

  ఈ సమాధి దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంది. ఈ సమాధిలోని ఐఫోన్ లో డిస్ ప్లే గా ఆమె కూతురు ఫోటోని ఆ తండ్రి పెట్టించారు. ఈ విషయాన్ని డైలి మెయిల్ బయటి ప్రపంచానికి అందించింది.

  చనిపోయిన రీటాకు ..

  అయితే ఈ విషయం మీద ఆ తండ్రి కామెంట్ చేయడానికి నిరాకరించారు. కాగా చనిపోయిన రీటాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని మాత్రం డైలీ మెయిల్ కథనంలో రాశారు. జర్మనీలో స్నేహితులు ఉన్నారని ఆ కథనంలో తెలిపారు.

  ఐఫోన్ xs ధరతో..

  కాగా ఈ సమాధి ఖర్చు ఆపిల్ కంపెనీ కొత్తగా రిలీజ్ చేసిన ఐఫోన్ xs ధరతో పోటీపడుతోంది, iphone-xs ఖరీదు 999 డాలర్లు కాగా ఈ సమాధి ఖర్చు దాదాపు 985.73 డాలర్లుగా ఉంది.

  అత్యంత ఖరీదై సున్నపురాయిని..

  ఈ ఐదు అడుగుల ఎత్తైన స్మారక టవర్ నిర్మాణం కోసం ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చిన అత్యంత ఖరీదై సున్నపురాయిని వాడారు. ఇది ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించారు.

  బ్లాక్ రంగులోని ఐఫోన్ ఆకారంలో..

  Rais Shameev కూతురు రీటా 2016లో అంతుచిక్కని వ్యాధితో చనిపోయింది. అయితే ఆమె చిన్నప్పటి నుంచే ఫోన్లు అంటే చాలా ఇష్టపడేదని అందువల్లే తండ్రి బ్లాక్ రంగులోని ఐఫోన్ ఆకారంలో ఈ సమాధిని నిర్మించాడని మాత్రం తెలుస్తోంది.

  క్యూఆర్ కోడ్ తో..

  ఇందులో ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే క్యూఆర్ కోడ్ తో ఈ సమాధిని నిర్మించడం. అలాగే ఐఫోన్ బటన్లు ఎలా ఉన్నాయో అచ్చం అలానే సమాధిని నిర్మించారు.

  కాగా ఇటువంటి సమాధులు నిర్మించాలనుకున్న వారికి సైబిరీయన్ కంపెనీ death accessoriesని అందిస్తోంది. ఆ కంపెనీకే ఈ సమాధికి పరికరాలను అందించే పక్రియను అప్పగించారు.

  కాగా ఇటువంటి సమాధులు నిర్మించాలనుకున్న వారికి సైబిరీయన్ కంపెనీ death accessoriesని అందిస్తోంది. ఆ కంపెనీకే ఈ సమాధికి పరికరాలను అందించే పక్రియను అప్పగించారు.

  డిజైన్ చేసిన వ్యక్తి..

  ఈ సమాధిని డిజైన్ చేసిన వ్యక్తి పేరు Pavel Kalyuk.ఇటువంటి క్రియేటీవిలు చేయడంలో ఆయన చాలా దిట్ట. ఈ సమాధితో అతనికి అవకాశాలు ఇప్పుడు భారీగానే తలుపుతడుతున్నాయని తెలుస్తోంది.

  ట్విట్టర్లో వైరల్

  కాగా ఈ న్యూస్ ఇప్పుడు ోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  DIEPHONE Mobile addict woman is buried under a tombstone depicting her favourite iPhone after dying aged just 25 More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more