కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్... చవక ధర ఇంకా ఆధునిక ఫీచర్లు!

Posted By: Super

కేక పుట్టించే స్మార్ట్‌ఫోన్... చవక ధర ఇంకా ఆధునిక ఫీచర్లు!

 

సెప్టంబర్ 2012, ఐఎఫ్ఏ ఎగ్జిబిషన్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ హువావీ టెక్నాలజీస్ ఆరు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటిలో ఒకటైన ప్రాధమిక స్ధాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఆసెండ్ వై100’ను దేశీయ మార్కెట్లో స్పైస్-హువావీలు సుంయుక్తంగా విడుదల చేసాయి. ‘ఎస్ హువావీ ఆసెండ్ వై100’ మోడల్‌లో విడుదలైన ఈ డివైజ్ ధర ఇంకా ఇతర ఫీచర్లు వివరాలు......

- 10.1 మిల్లీమీటర్ల మందం, బరువు 100 గ్రాములు,

- 2.8 అంగుళాల 262కే కలర్ టీఎఫ్‌టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 320 × 240పిక్సల్స్),

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్7225ఏ ప్రాసెసర్,

- 3.2 మెగాపిక్సల్ కెమెరా,

- 3జీ హెచ్‌ఎస్‌పీఏ 7.2ఎంబీపీఎస్, వై-ఫై 802.11బి/జి/ఎన్,

- బ్లూటూత్ వీ2.1+ఈడిఆర్, జీపీఎస్/ఏజీపీఎస్,

- 256ఎంబీ ర్యామ్, 512ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

- 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

- ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

- 1050ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై 300 గంటలు, టాక్‌టైమ్ 300 నిమిషాలు).

ధర ఇతర వివరాలు:

ఎస్ హువావీ ఆసెండ్ వై100ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ డాట్ కామ్’ రూ.5,990కి ఆఫర్ చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot