స్మార్ట్‌ఫోన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సచిన్

Written By:

ప్రపంచస్థాయి లక్ష్యాలతో ప్రారంభమైన ప్రముఖ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటీ) స్టార్టప్ Smartron తన మొదటి రేంజ్ ఉత్పత్తులను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ కంపెనీకి పెట్టుబడిదారుడి ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ఈ ప్రోడక్ట్స్‌ను విడుదల చేసారు.

స్మార్ట్‌ఫోన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సచిన్

స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, అల్ట్రాబుక్స్ అలానే IoT డివైస్‌లను తయారు చేసే ఈ కంపెనీకి సచిన్ ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. స్మార్ట్రాన్ సంస్థ ఈ రోజు లాంచ్ చేసిన ఉత్పత్తుల్లో t.book (2 ఇన్ 1 టాబ్లెట్), t.phone (స్మార్ట్‌ఫోన్), tron.x (క్లౌడ్ ఆధారిత ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్)లు ఉన్నాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే Smartron t.book ఏప్రిల్ 8 నుంచి మార్కెట్లో దొరుకుతుంది. t.phone ఏప్రిల్ 18 నుంచి మార్కెట్లో దొరుకుతుంది. ధర రూ.39,999.

Read More : కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Smartron t.book డిజైన్

మెగ్నీషియం బిల్డ్ బాడీతో వస్తున్న ఈ 2 ఇన్ 1 పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్ ప్రత్యేకమైన డ్యుయల్ టోన్ స్టైలింగ్ అలానే పూర్తి మెటల్ బాడీ డిజైన్‌తో వస్తోంది. ఏర్పాటు చేసిన ఫ్లిప్ అవుట్ స్టాండ్ ద్వారా డివైస్‌ను మరింత కంఫర్టబుల్‌గా ఉపయోగించుకోవచ్చు. అయస్కాంత స్ట్రిప్‌తో వచ్చే కీబోర్డ్‌ను కావల్సినపుడు అటాచ్ లేదా డిటాచ్ చేసుకోవచ్చు.

Smartron t.book డిస్‌ప్లే

ఈ హైబ్రీడ్ కన్వర్టర్ 12.2 అంగుళాల మల్టీటచ్ WQXGA IPS డిస్ ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ వచ్చేసరికి 2560x1600పిక్సల్స్. ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఓలియోఫోబిక్ కోటింగ్ ఆకట్టుకుంటుంది.

 

Smartron t.book స్పెసిఫికేషన్స్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది. ఇంటెల్ కోర్ ఎమ్ 64-బిట్ ప్రాసెసర్‌ను టీ.బుక్‌లో పొందుపరిచారు. 4జీబి ర్యామ్, 128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

Smartron t.book కెమెరా

ఈ 2 ఇన్ 1 పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌లో 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ హైడెఫినిషన్ కెమెరాను ఏర్పాటు చేసారు.

 

Smartron t.book బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు

ఈ 2 ఇన్ 1 డివైస్ శక్తివంతమైన 10,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫుల్ ఛార్జ్ పై 10 గంటల వెబ్ బ్రౌజింగ్ లేదా 28 గంటల స్టాండ్ టైమ్‌ను ఆస్వాదించవచ్చు. కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే.. రెండు పూర్తి సైజు యూఎస్బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డీఎమ్ఐ పోర్ట్, 3.5 హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఎస్డీ కార్డ్, యూఎస్బీ టైప్ సీ కనెక్టువిటీ.

 

Smartron t.phone

ఈ ప్రీమియమ్ బిల్ట్ ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఏప్రిల్ 3న నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్‌ను విడుదల చేస్తారు.

 

Smartron tron.x

ఈ క్లౌడ్ ఆధారిత ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ అన్ని డివైసెస్‌తో పాటు సాఫ్ట్‌వేర్, క్లౌడ్, క్రౌడ్ ఇంకా హబ్ సర్వీసులను అనుసంధానించి హబ్‌ట్రాన్ ద్వారా ఇంటెలిజెన్స్ అలానే పర్సనలైజిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sachin Tendulkar joins Hyderabad based start-up to launch a smartphone & desi Surface Pro 4 rival!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot