మరో ట్విస్ట్... మరోసారి ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్.. షరతులు పెట్టి మరీ..!
ఓపెన్ ఏఐ సంస్థలో (Open AI) గతం వారం రోజులుగా నడుస్తున్న పరిణామాలకు తెరపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మాన్ తిరిగి ఓపెన్ ఏఐ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతోపాటు ఓపెన్ ఏఐ సంస్థ నూతన డైరెక్టర్ల బోర్డును నియమించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ X (ట్విట్టర్) వేదికగా ప్రకటన చేశారు.
ఎంతో ఆసక్తిగా ఉన్నా... : ఓపెన్ ఏఐ అంటే తనకెంతో ఇష్టమని ఆల్ట్‌మాన్ (Sam Altman) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంస్థ లక్ష్యం కోసం గత కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ ఏఐకి తిరిగొచ్చి మైక్రోసాఫ్ట్‌తో బంధాన్ని నిలిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు (X) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

శామ్ ఆల్ట్‌మాన్ కోసం తీవ్ర ఒత్తిడి : సేల్స్‌ఫోర్స్ మాజీ కో- సీఈవో బ్రెట్ టేలర్, అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, కోరా సీఈవో ఆడమ్ డీ ఏంజీలో ఓపెన్ ఏఐ సంస్థ కొత్త బోర్డు ఏర్పాటు కానుంది.
ఓపెన్ ఏఐ నుంచి తొలగింపు అనంతరం శామ్ ఆల్ట్‌మాన్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మద్దతుగా నిలిచినట్లు వార్తలు వచ్చాయి. దాంతోపాటు సంస్థ ఇన్వె్స్టర్లు ఆల్ట్‌మన్ వైపు నిలిచినట్లు తెలుస్తోంది. దాంతోపాటు సంస్థ ఉద్యోగుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది.
షరతులు విధించిన ఆల్ట్‌మాన్ : ఓపెన్ ఏఐ సంస్థలోకి తిరిగి వచ్చేందుకు ఆల్ట్‌మాన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బోర్డును తొలగింపు సహా తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని షరతులు విధించినట్లు తెలుస్తోంది. సంస్థ కూడా ఆల్ట్‌మాన్ షరతులను అంగీకరించినట్లు సమాచారం. దీంతో త్వరలో నూతన బోర్డు ఏర్పాటు కానుంది.
మద్దతుగా నిలిచిన సత్య నాదెళ్ల : ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన అనంతరం.. సంస్థ సహా వ్యవస్థాపకుడుగా ఉన్న గ్రెగ్ బ్రోక్‌మాన్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే అనంతరం వారిద్దరినీ మైక్రోసాఫ్ట్ అడ్వాన్సడ్ ఏఐ రీసెర్ట్ టీంలోకి తీసుకుంటున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుతామని తెలిపారు. అయితే అంతలోనే ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్ నియమితులయ్యారు.
తొలగింపు సమయంలో ఆరోపణలు : ఓపెన్ ఏఐ సీఈవోగా ఉన్న శామ్ ఆల్టమన్‌ను తొలగించిన సమయంలో బోర్డు కీలక ఆరోపణలు చేసింది. శామ్ ఆల్ట్‌మాన్ అంతర్గత చర్చల్లో నిజాయితీగా లేరని, బోర్డుకు సరైన సమాచారం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది. బోర్డు తీసుకొనే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని, శామ్ పనితీరుపై బోర్డుకు విశ్వాసం లేదని తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








