Open AI సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్ బాధ్యతలు.. బోర్డులోకి మైక్రోసాఫ్ట్ ఎంట్రీ.. !
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్న ChatGPTని విడుదల చేసిన ఓపెన్ ఏఐ ( Open AI ) సంస్థలో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఈవోగా ఉన్న శామ్ ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ ఏఐ డైరెక్టర్ల బోర్డు తొలగించింది. అయితే అనంతరం పరిణామాల్లో శామ్ ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ ఏఐ సంస్థ తిరిగి సీఈవోగా నియమితులు అయ్యారు.
అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. తనమీద చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడం సహా ప్రస్తుత బోర్డును రద్దు చేయాలంటూ మరో షరతు విధించారు. ఈ రెండింటికి అంగీకరించిన సంస్థ ఏకంగా బోర్డు సభ్యుల్లోనూ మార్పులు చేసింది. తాజాగా ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్ బాధ్యతలు తీసుకున్నారు.

ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ సంస్థ డైరెక్టర్ల బోర్డులో చేరింది. నాన్ ఓటింగ్ అబ్జర్వర్‌గా చేరింది. అంటే ఓపెన్ ఏఐ సంస్థ బోర్డు సమావేశాలకు మైక్రోసాఫ్ట్ హాజరవుకావచ్చు మరియు వారి రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే బోర్డు తీసుకొనే నిర్ణయాలలో ఓటు వేసే హక్కు లేదు.
మైక్రోసాఫ్ట్ బోర్డులో చేరడంపై ఓపెన్ ఏఐ సంస్థ ఉద్యోగులకు మెమో ద్వారా సీఈవో శామ్ ఆల్ట్‌మాన్ తెలియజేశారు. సంస్థలోని ఉద్యోగుల పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ లక్ష్యాలను చేరుకోవడం సహా ఉద్యోగుల విజయానికి ఎక్కువ అవకాశాలున్నాయని శామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.
ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం జరిగాక, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వారు చేసిన కృషిపై ప్రశంసలు కురిపించారు. ఏఐపై పనిచేసినందుకు రెండు సంస్థల ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మరియు ఏఐ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు.
సేల్స్‌ఫోర్స్ మాజీ కో- సీఈవో బ్రెట్ టేలర్, అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, కోరా సీఈవో ఆడమ్ డీ ఏంజీలో ఓపెన్ ఏఐ కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఓపెన్ ఏఐ నుంచి తొలగింపు అనంతరం శామ్ ఆల్ట్‌మాన్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మద్దతుగా నిలిచినట్లు వార్తలు వచ్చాయి. దాంతోపాటు సంస్థ ఇన్వె్స్టర్లు ఆల్ట్‌మన్ వైపు నిలిచారు. ఉద్యోగుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది.
ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన అనంతరం.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడుగా ఉన్న గ్రెగ్ బ్రోక్‌మాన్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే అనంతరం వారిద్దరినీ మైక్రోసాఫ్ట్ అడ్వాన్సడ్ ఏఐ రీసెర్ట్ టీంలోకి తీసుకుంటున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చుతామని తెలిపారు. అయితే అంతలోనే ఓపెన్ ఏఐ సీఈవోగా శామ్ ఆల్ట్‌మాన్ నియమితులయ్యారు.
ఓపెన్ ఏఐ సీఈవోగా ఉన్న శామ్ ఆల్టమన్‌ను తొలగించిన సమయంలో బోర్డు కీలక ఆరోపణలు చేసింది. శామ్ ఆల్ట్‌మాన్ అంతర్గత చర్చల్లో నిజాయితీగా లేరని, బోర్డుకు సరైన సమాచారం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది. బోర్డు తీసుకొనే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని, శామ్ పనితీరుపై బోర్డుకు విశ్వాసం లేదని తెలిపింది.


Click it and Unblock the Notifications








