రూ.31,490 నుంచే శాంసంగ్ 4K స్మార్ట్ టీవీలు.. QLED QEF1, క్రిస్టల్ UHD సిరీస్ లాంచ్.. 7 ఏళ్ల అప్‌డేట్స్!
Samsung 2025 smart TVs India: టెక్ ప్రియులకు శుభవార్త. శాంసంగ్ ఇండియాలో తన సరికొత్త 2025 స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్ వెబ్‌సైట్లలో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త లైనప్‌లో QLED QEF1 సిరీస్, క్రిస్టల్ 4K UHD టీవీలు (UE81, UE84, UE86 వేరియంట్లలో) ఉన్నాయి.
ఈ టీవీలు AI (కృత్రిమ మేధస్సు) ఆధారిత ఫీచర్లు, 4K రిజల్యూషన్, మెరుగైన సౌండ్, పిక్చర్ క్వాలిటీతో ఆకట్టుకునే ధరలలో లభిస్తున్నాయి. ఈ సరికొత్త QLED QEF1 మరియు క్రిస్టల్ 4K UHD వేరియంట్లు అధునాతన టెక్నాలజీని బడ్జెట్ ధరల్లో అందిస్తున్నాయి. ఆన్‌లైన్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని వీటిని ప్రత్యేకంగా విడుదల చేశారు.

* శాంసంగ్ QLED QEF1 4K టీవీ ఫీచర్లు..
శాంసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ 4K QLED టీవీ ఈ QEF1. దీనిలో శక్తివంతమైన Q4 AI ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 43", 55", 65", 75" స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ప్రాసెసర్, మనం చూస్తున్న కంటెంట్‌ను బట్టి ఎప్పటికప్పుడు (రియల్ టైంలో) విజువల్స్, సౌండ్‌ను మెరుగుపరుస్తుంది,
తద్వారా స్పష్టమైన, మనకు నచ్చినట్టుగా టీవీ చూసే అనుభూతిని అందిస్తుంది. ఇందులో 100% కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ ఉంది. రంగులు అత్యంత సహజంగా కనిపించడానికి పాంటోన్ వ్యాలిడేషన్ (Pantone validation) కూడా ఉంది. తక్కువ క్వాలిటీ వీడియోలను కూడా 4K లాగా మార్చే 4K అప్‌స్కేలింగ్ ఉంది.
HDR10+ సపోర్ట్, సినిమా దర్శకుడు ఎలాగైతే చిత్రీకరించాడో అలాగే చూసేందుకు ఫిల్మ్‌మేకర్ మోడ్ (Filmmaker Mode) వంటివి ఉన్నాయి. వీటి వల్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది. వేగవంతమైన యాక్షన్ సీన్లు కూడా స్మూత్‌గా, బ్లర్ లేకుండా కనిపించడానికి మోషన్ యాక్సిలరేటర్ (Motion Xcelerator) ఫీచర్ కూడా ఉంది.
* ఆడియో
సౌండ్ కోసం 20W సామర్థ్యం గల 2.0 ఛానల్ స్పీకర్లు ఉన్నాయి. దీనికి OTS లైట్ (Object Tracking Sound Lite) అంటే స్క్రీన్‌పై వస్తువు కదలికను బట్టి సౌండ్ రావడం), క్యూ-సింఫనీ (Q-Symphony) అంటే టీవీ స్పీకర్లు, కంపాటబుల్ సౌండ్‌బార్ కలిసి పనిచేయడం వంటి టెక్నాలజీల సపోర్ట్ కూడా ఉంది.
* స్మార్ట్ ఫీచర్లు
విజన్ AI, జనరేటివ్ వాల్‌పేపర్స్, స్మార్ట్‌థింగ్స్ సపోర్ట్, AI ఆటో గేమ్ మోడ్, గేమ్ మోషన్ ప్లస్ వంటి అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ టైజెన్ OS (Tizen OS) పై పనిచేస్తుంది. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 125కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను ఉచితంగా చూడవచ్చు.
* ఇతరాలు
డేటా భద్రత కోసం శాంసంగ్ నాక్స్ (Samsung Knox) సెక్యూరిటీ ఉంది. కంపెనీ ఈ టీవీలకు 7 సంవత్సరాల పాటు OS అప్‌డేట్స్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్ట్స్ (ఒకటి eARC సపోర్ట్‌తో), 1 USB-A పోర్ట్, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, ఇంటర్నెట్ కేబుల్ కోసం ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి.
* శాంసంగ్ క్రిస్టల్ 4K UHD టీవీ ప్రత్యేకతలు
2025 క్రిస్టల్ సిరీస్ టీవీలు UE81, UE84, UE86 మోడల్స్‌లో వస్తున్నాయి. ఇవి 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వివిధ స్క్రీన్ సైజులలో లభిస్తాయి. ఈ టీవీలు క్రిస్టల్ ప్రాసెసర్ 4Kతో పనిచేస్తాయి. ఇవి కూడా HDR10+, 4K అప్‌స్కేలింగ్, మోషన్ యాక్సిలరేటర్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి.
ఫిల్మ్‌మేకర్ మోడ్ కూడా ఉంది, ఆడియో విషయానికి వస్తే, వీటిలో కూడా 20W, 2.0 ఛానల్ స్పీకర్ సిస్టమ్, OTS లైట్, Q-సింఫనీ టెక్నాలజీలు ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే ఈ మోడల్స్‌లో AI ఎనర్జీ మోడ్, స్మార్ట్‌థింగ్స్ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, సోలార్ పవర్ తో పనిచేసే రిమోట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
QLED మోడల్స్ లాగే ఇవి కూడా టైజెన్ OSపై పనిచేస్తాయి, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందుతాయి, శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా ఫ్రీగా లైవ్ ఛానెల్స్ అందిస్తాయి. దీనివల్ల, వినియోగదారులు టీవీని ఎక్కువ కాలం లేటెస్ట్ ఫీచర్లతో, సురక్షితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్ పాలసీ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.
* ధరలు, లభ్యత ఆఫర్లు
క్రిస్టల్ UHD సిరీస్ ప్రారంభ ధర రూ.31,490. QEF1 QLED సిరీస్ ప్రారంభ ధర రూ.39,990గా నిర్ణయించారు. ఈ అన్ని కొత్త మోడల్స్ 2025, మే 1 నుంచే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి.
ఆఫర్లు చూస్తే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వడ్డీ లేని EMI (No-cost EMI) సౌకర్యం కూడా ఉంది. క్రిస్టల్ UHD టీవీలపై నెలకు రూ.2,500 నుంచి, QLED టీవీలపై నెలకు రూ.3,333 నుంచి EMI మొదలవుతుంది.


Click it and Unblock the Notifications








