శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo లాంచ్ అయింది!! పూర్తి వివరాలు ఇవిగో....

|

శాంసంగ్ సంస్థ నేడు కొత్తగా 35W పవర్ అడాప్టర్ Duo ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వాల్ ఛార్జర్ రెండు పరికరాలకు వేగంగా ఏకకాలంలో ఛార్జింగ్‌ని అందిస్తుంది. టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లు కాకుండా ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా త్వరగా ఛార్జ్ చేయగలదని శామ్‌సంగ్ సంస్థ తెలిపింది. ఇది వైర్‌లెస్ ఛార్జర్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఛార్జర్‌ను TWS ఇయర్‌బడ్స్ మరియు పవర్ బ్యాంక్‌లకు ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒక USB టైప్-C మరియు ఒక USB టైప్-A ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. 50 శాతం తక్కువ ఛార్జింగ్ సమయంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఛార్జర్ జ్యూస్ అప్ చేయగలదని శాంసంగ్ పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo ధర & లభ్యత వివరాలు

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo ధర & లభ్యత వివరాలు

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo యొక్క ధర సుమారు రూ.2,299. ఈ కొత్త శాంసంగ్ ఛార్జర్ రిటైల్ దుకాణాలు, Samsung.com మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లలో అందుబాటులో ఉంది.

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo ఫీచర్లు

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo ఫీచర్లు

శాంసంగ్ 35W పవర్ అడాప్టర్ Duo USB టైప్-C PD (పవర్ డెలివరీ) 3.0 పోర్ట్ ద్వారా గరిష్టంగా 35W ఛార్జింగ్ మరియు USB టైప్-A పోర్ట్ ద్వారా గరిష్టంగా 15W ఛార్జింగ్‌ను అందిస్తుంది. USB టైప్-C ద్వారా ఒకే పరికరాన్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు అడాప్టర్ 35W వరకు శక్తిని సరఫరా చేస్తుందని మరియు 35W గరిష్ట పవర్ అవుట్‌పుట్ PCలను ఛార్జ్ చేయడానికి మాత్రమే కేటాయించబడిందని శామ్సంగ్ సంస్థ తెలిపింది. అదనంగా శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను 50 శాతం తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. Samsung ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధతి Galaxy Note పరికరాలు (Galaxy Note 10 మరియు అంతకంటే ఎక్కువ) మరియు Galaxy S సిరీస్ (Galaxy S10 5G మరియు అంతకంటే ఎక్కువ) కోసం మద్దతునిస్తుందని కంపెనీ తెలిపింది.

Samsung
 

"స్థిరమైన వినియోగ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటానికి మరియు కొత్త ఫోన్‌లతో అనవసరమైన ఛార్జర్ ఉపకరణాలను నిరంతరం స్వీకరించడానికి వినియోగదారులకు కలిగే ఒత్తిడిని తొలగించడానికి" ఇన్-బాక్స్ పరికర ప్యాకేజింగ్ నుండి ఛార్జర్ ప్లగ్‌లు మరియు ఇయర్‌ఫోన్‌లను క్రమంగా తొలగిస్తామని Samsung ఇప్పటికే వెల్లడించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం శామ్‌సంగ్ 2017 నుండి స్టాండర్డ్ USB టైప్-C రకం ఛార్జింగ్ పోర్ట్‌లను అమలు చేస్తోంది. అలాగే పాత ఛార్జర్‌లను కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా మారుస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung 35W Power Adapter Duo Released in India With USB Type-C, USB Type-A Ports

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X