Home
News

బ్యాటరీల కోసం చేతులు కలిపిన శామ్‌సంగ్, యాపిల్.. చైనా ఫోన్లకు చెక్ పెట్టేనా?

By Ram Kumar

ఈ రెండు కంపెనీలు కలిసి బ్యాటరీ టెక్నాలజీలో సరికొత్త విప్లవాన్ని సృష్టించబోతున్నాయి. ఈ భాగస్వామ్యం వెనుక బలమైన కారణం ఉంది. ఇప్పటికే చైనాకు చెందిన ఒప్పో, రెడ్ మ్యాజిక్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 7,000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లను విడుదల చేసి మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ఈ పోటీని తట్టుకోవాలంటే శామ్‌సంగ్, యాపిల్ కొత్తగా ఆలోచించక తప్పలేదు.

Samsung and Apple Collaborate to Revolutionize Smartphone Battery Tech for Boosted Capacity

* శామ్‌సంగ్ కొత్త బ్యాటరీ డిజైన్

శామ్‌సంగ్ తన భవిష్యత్ స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యాన్ని భారీగా పెంచడానికి ఒక సరికొత్త డిజైన్‌పై పనిచేస్తోంది. బ్యాటరీ తయారీలో వాడే మెటీరియల్‌లో సిలికాన్ ఎక్కువగా ఉండేలా చూస్తోంది. బ్యాటరీలోని ఆనోడ్, క్యాథోడ్ రెండింటిలోనూ అత్యాధునిక మెటీరియల్స్‌ను ఉపయోగించి సిలికాన్ శాతం పెంచడంపై శాంసంగ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇలా చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. అంతేకాదు, ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలలో సాధారణంగా వచ్చే సమస్య అయిన బ్యాటరీ ఉబ్బిపోవడం లాంటి వాటిని కూడా ఈ కొత్త టెక్నాలజీతో పరిష్కరించవచ్చని శామ్‌సంగ్ భావిస్తోంది. సిలికాన్ వాడకం బ్యాటరీ పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, ఛార్జింగ్ ఎక్కువసేపు నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కొత్త బ్యాటరీలు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ శామ్‌సంగ్ మాత్రం బ్యాటరీ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. దీంతో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి శామ్‌సంగ్‌కు అవకాశం లభిస్తుంది.

* 2026 నాటికి యాపిల్ బ్యాటరీల విప్లవం..

యాపిల్ కూడా బ్యాటరీ టెక్నాలజీలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. సొంతంగా బ్యాటరీ అభివృద్ధిపై దృష్టి సారించిన యాపిల్, 2026 నాటికి తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ కొత్త బ్యాటరీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

పరిశోధన, అభివృద్ధిపై యాపిల్ పెట్టే ప్రత్యేక శ్రద్ధ గురించి మనందరికీ తెలిసిందే. గతంలో ఎన్నో టెక్నాలజీల్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన యాపిల్, ఇప్పుడు బ్యాటరీ పనితీరులో కూడా సరికొత్త శిఖరాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది.

* చైనా బ్రాండ్ల దూకుడు

ఇచైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల గురించి చెప్పాలంటే, బ్యాటరీ విషయంలో అవి ఇప్పటికే చాలా ముందున్నాయి. రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఏకంగా 7,050mAh బ్యాటరీతో మార్కెట్లో సందడి చేస్తోంది. అంతేకాదు, ఒప్పో కూడా 7,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

కొన్ని నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి చైనా బ్రాండ్లు 8,000mAh బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే అవకాశం కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. కంపెనీలు పనితీరు, డిజైన్‌తో పాటు బ్యాటరీ లైఫ్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung, Apple are collaborating to develop advanced battery technology, aiming to increase capacity without compromising design. Meanwhile, Chinese brands like Oppo and Red Magic lead with larger batteries over 7,000mAh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X