సామ్‌సంగ్‌తో చేతులు కలిపిన జియో

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా సామ్‌సంగ్‌, రిలయన్స్ జియోలు చేతులు కలిపాయి. 'I&G (Infill & Growth)' పేరుతో సంయుక్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన ఈ రెండు కంపెనీలు భారత్‌లో భవిష్యత్ నెట్‌వర్క్ అవసరాల నిమిత్తం కలిసి పనిచేయబోతోన్నాయి.

Read More : కొత్త ఆఫర్, రోజుకు 2జీబి Jio డేటా, సంవత్సరమంతా కాల్స్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

90% గ్రామీణ ప్రాంతాలకు నెట్‌వర్క్ కవరేజ్ ..

ఈ జాయింట్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా Jio ఆఫర్ చేస్తున్న ఎల్టీఈ సేవలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్ కెపాసిటీతో పాటు నెట్‌వర్క్ కవరేజ్‌ను మరింతగా విస్తరించనున్నారు. ఇందుకుగాను 850 Hz, 1800 Hz, 2300MHz బ్యాండ్ విడ్త్‌లలో ఈ రెండు కంపెనీలు స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోబోతున్నాయి. తాజా డెవలప్‌మెంట్‌తో రిలయన్స్ జియో నెట్‌వర్క్ కవరేజ్ 90% గ్రామీణ ప్రాంతాలకు రీచ్ కాగలదు. భారత్‌లో లాంచ్ చేయబోయే 5జీ నెట్‌వర్క్ విషయంలోనూ జియో, సామ్‌సంగ్‌తో కలిసి పనిచేయబోతోంది. గతంలో జియోకు అవసరమైన ఎల్టీఈ కోర్, బేస్ స్టేషన్స్, వోల్ట్ సర్వీసులకు అవసరమైన సోల్యూషన్స్‌ను సామ్‌సంగ్ సమకూర్చటం జరిగింది.

2 లక్షల 50 వేల కిలోమీటర్ల మేర

జియో దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల కిలో మీటర్ల మేర ఫైబర్ ఆఫ్టిక్ ను 4జీ కోసం వేయనుందని ముఖేష్ అంబాని చెప్పారు. అయితే దీన్ని 5జీ, 6జీకి వాడుకునే విధంగా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

నోకియా 3310 (2017) vs నోకియా 3310 (2000)

4జీ వైర్లే 5జీకి కనెక్ట్ అయ్యే విధంగా..

రానున్న మూడు సంవత్సరాల్లో పైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ 5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా మలుస్తామని ఆ దిశగానే అడుగులు వేస్తామని 4జీ వైర్లే 5జీకి కనెక్ట్ అయ్యే విధంగా గ్రామ గ్రామాలకు విస్తరిస్తామని అంబాని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఈ ఫైబర్ సేవలు అందించడమే లక్ష్యంగా జియో పనిచేస్తుందని తెలిపారు.

హైస్పీడ్ ఐపీ నెట్‌వర్క్ ..

వచ్చే తరానికి డిజిటల్ సర్వీసులు ప్రొవైడ్ చేసేది ఒక్క జియో మాత్రమేనని అన్ని మార్గాల ద్వారా కష్టమర్లకు చేరువ అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖేష్ అంబాని తెలిపారు. స్టార్టప్‌లు అలాగే ఎంటర్ ప్రైజెస్‌లను కోసం పెద్ద మొత్తాన్నే కేటాయించామని, చిన్న తరహా పరిశ్రమలకు అలాగే ఎస్‌ఎమ్బిలకు హైస్పీడ్ ఐపీ నెట్‌వర్క్ ద్వారా జియో సర్వీసులను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Made in India ట్యాగ్‌తో నోకియా ఫోన్‌లు

ప్రపంచంలో సగం ఇంటర్నెట్ ట్రాఫిక్ జియో నుంచి...

ఈ ఫైబర్ నెట్‌వర్క్ ని అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందిస్తున్నామని ప్రపంచంలో సగం ఇంటర్నెట్ ట్రాఫిక్ జియో నుంచి వెళ్లేలా చూస్తామని కష్టమర్ల సంతోషమే జియో ధ్యేయమని ఎజీఎమ్ మీటింగ్ లో అంబాని తెలిపారు. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ ఫైబర్ ఆఫ్టిక్ ను దేశమంతా విస్తరించింది. అయితే ఇప్పుడున్నది సరిపోదని ఇప్పుడున్న దాని కన్నా దాదాపు 80 సార్లు ఫాస్ట్ గా బ్రాడ్ బ్యాండ్ రన్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం.

జపాన్, అమెరికా వంటి దేశాలు

టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో ఉన్న జపాన్, అమెరికా వంటి దేశాలు 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ 5జీ నెట్‌వర్క్ పై ముమ్మర పరిశోధనలు మొదలుపెట్టేసాయి. 5జీ నెట్‌వర్క్ రూపకల్పన ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నప్పటికి ఏదో ఒక రోజున కమర్షియల్‌గా అందుబాటులోకి రావటం తద్యం.

ఏదికొన్నా 50% తగ్గింపు, సామ్‌సంగ్ సంచలనం

సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌..

త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ, మునుపెన్నడు ఆస్వాదించని సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 5జీ ఎంత స్పీడ్‌లో లభ్యమవుతుంది..?, ఎంత డేటాను ఖర్చు చేస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన జవాబులు లేవు. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం కానుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై 5జీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది.

3జీ, 4జీలతో పోలిస్తే ఖరీదైన నెట్‌వర్క్‌‌..

త్వరలో రాబోయే 5జీ నెట్‌వర్క్ 3జీ, 4జీలతో పోలిస్తే ఖరీదైన నెట్‌వర్క్‌‌గా అవతరించనుంది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అంత సలువైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖరీదైన టెక్నాలజీకి సంబంధించి పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు లక్షల కోట్ల పెట్టుబడలతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడిన పాలసీలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

నోకియా స్నేక్ గేమ్ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో

GTI 2.0 ప్రోగ్రామ్‌

రానున్న ఐదు సంవత్సరాల్లో 5జీ టెక్నాలజీ పై కృషి చేసేందుకు దిగ్గజ టెలికామ్ ఆపరేటర్స్ అయిన చైనా మొబైల్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్ బ్యాంక్‌లు సంయుక్తంగా GTI 2.0 పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసాయి. 5జీ నెట్‌వర్క్ గురించి ఇప్పటికి వరకు ఏ విధమైన అధికారిక డెఫినిషన్ వెలుగులోకి రాలేదు. అయితే, 5జీ అనేది 4జీ నెట్‌వర్క్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా వస్తోన్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అని ధృడంగా చెప్పొచ్చు.

4జీ ఎల్టీఈ అంటే..

4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో 4జీ ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) అనేది బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 100 Mbit/sగాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 4జీ టెక్నాలజీలో ఎల్టీఈ-ఏ అనేది అడ్వాన్సుడ్ వర్షన్‌గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 500 Mbit/s గాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 2020లో రాబోతోన్న 5జీ టెక్నాలజీ డేటా స్పీడ్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు.

హువావీ 2020 నాటికి ..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. మరో సంస్థ ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము 2015 అక్టోబర్‌ 13న అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung and Reliance Jio partners to upgrade current LTE network in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot