శాంసంగ్ యానివర్సరీ సేల్, 55 ఇంచ్ స్మార్ట్ టీవీపై రూ. 48 వేల తగ్గింపు

By Gizbot Bureau
|

ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్ల హోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కూడా సరికొత్త ఆఫర్లకు తెరలేపింది. ఇందులో భాగంగా Samsung Anniversary saleని నిర్వహిస్తోంది. అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను కేటిగిరీల వైడ్ గా ప్రకటించింది. ఆడియో డివైస్ లు, అలాగే టీవీలు, స్మార్ట్ ఫోన్లు వంటి వాటిపై ఈ ఆఫర్లు ఉండనున్నాయి. ఈ సేల్ మొత్తం ఏడు రోజుల పాటు శాంసంగ్ నిర్వహించనుంది. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ సేల్ జరగనుంది. అక్టోబర్ 13 వరకు యూజర్లు ఈ సేల్ ద్వారా నచ్చిన ఉత్పత్తులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

గెలాక్సీ ఎస్9, నోట్9 ఫోన్లపై సేల్‌లో భారీ డిస్కౌంట్‌
 

గెలాక్సీ ఎస్9, నోట్9 ఫోన్లపై సేల్‌లో భారీ డిస్కౌంట్‌

ఇందులో భాగంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లతోపాటు అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. సేల్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ట్రాన్సాక్షన్లతో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఎస్9, నోట్9 ఫోన్లపై సేల్‌లో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

పలు టీవీలపై తగ్గింపు ధరలు

పలు టీవీలపై తగ్గింపు ధరలు

శాంసంగ్ యానివర్సరీ సేల్‌లో గెలాక్సీ ఎస్9 (64జీబీ) ఫోన్‌ను రూ.29,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ మోడల్ ధర రూ.49,900గా ఉంది. గెలాక్సీ నోట్ 9ను రూ.42,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎం30ఎస్‌ను రూ.13,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. అదేవిధంగా పలు టీవీలపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక హర్మాన్ కార్డన్ ఆడియో ఉత్పత్తులపై 50 శాతం వరకు, జేబీఎల్ ఆడియో ఉత్పత్తులపై 60 శాతం వరకు, మెమొరీ, స్టోరేజ్ డివైసెస్‌పై 40 నుంచి 60 శాతం వరకు శాంసంగ్ తగ్గింపు ధరలను అందిస్తున్నది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్

శాంసంగ్ గెలాక్సీ వాచ్

ఈ సేల్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ వాచీపై రూ. 6 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. Samsung Galaxy Watch with 46mm and 42mm ధర రూ.23,990గా ఉంది. ఈ సేల్ లో ఇది రూ.19,999కే లభిస్తోంది.

55-inch Frame 4K UHD TV
 

55-inch Frame 4K UHD TV

ఈ సేల్ లో భాగంగా శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ.84,990కే సొంతం చేసుకోవచ్చు. దీని ధర మార్కెట్లో రూ.1,33,990గా ఉంది. దాదాపు రూ. 48 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అాగే ఈఎమ్ఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Anniversary sale is live; offers Galaxy S9 at Rs 29999, Note 9 at Rs 42,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X