200-MP ISOCELL HP3 ఇమేజ్ సెన్సార్‌ను ఆవిష్కరించిన Samsung..

|

ప్రముఖ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ సంస్థ నేడు 200-మెగాపిక్సెల్ ISOCELL HP3 సెన్సార్‌ను ఆవిష్కరించింది. తాజా ఇమేజ్ సెన్సార్ గత సంవత్సరం విజయవంతమైన ISOCELL HP1 0.56-మైక్రాన్ పిక్సెల్‌లను (μm) సెన్సార్‌కు అప్ గ్రేడ్ వెర్షన్ గా అభివృద్ధి చేసింది. ఇది 1/1.4 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్‌లతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వీక్షణ ఫీల్డ్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వద్ద 8K వీడియోలను క్యాప్చర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. దక్షిణ కొరియా బ్రాండ్ యొక్క కొత్త ISOCELL HP3 సెన్సార్ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభమవుతుందని ధృవీకరించింది. 2019లో ISOCELL స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి 108-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను ఆవిష్కరించింది.

ISOCELL HP3

దక్షిణ కొరియా టెక్ కంపెనీ తన న్యూస్‌రూమ్ ద్వారా కొత్త ISOCELL HP3 సెన్సార్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది పరిశ్రమ యొక్క అతి చిన్న 0.56-మైక్రాన్ పిక్సెల్‌లతో కూడిన మొదటి మొబైల్ సెన్సార్‌గా పేర్కొనబడింది. ISOCELL HP3 మునుపటి 0.64-మైక్రాన్ పిక్సెల్‌ల కంటే 12 శాతం చిన్న పిక్సెల్ పరిమాణాన్ని కలిగి ఉందని చెప్పబడింది. ఇది కెమెరా మాడ్యూల్ ఉపరితల వైశాల్యంలో దాదాపు 20 శాతం తగ్గింపుతో 1/1.4 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్‌లను కలిగి ఉంటుంది. దీనితో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ పరికరాలను స్లిమ్‌గా ఉంచడానికి అనుమతిస్తుంది.

ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!

సూపర్ QPD ఆటో-ఫోకస్

సూపర్ QPD ఆటో-ఫోకస్ సామర్థ్యాలతో ISOCELL HP3 సెన్సార్ పిక్సెల్‌లు అన్నీ ఆటో-ఫోకసింగ్ సామర్థ్యాలతో అమర్చబడి ఉంటాయి. శామ్సంగ్ ప్రకారం సూపర్ QPD సమాంతర మరియు నిలువు దిశలలో తేడాలను గుర్తించడానికి పిక్సెల్‌లలోని ఒకే లెన్స్‌ను ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన ఆటో ఫోకస్‌ని అందిస్తుంది. ఈ సెన్సార్ తో వినియోగదారులను 30fps వద్ద 8K లేదా 120fps వద్ద 4K వీడియోలను తీయడానికి అనుమతిస్తుంది.

Tetra2pixel టెక్నాలజీ

Samsung యొక్క కొత్త ISOCELL HP3 సెన్సార్‌లో Tetra2pixel టెక్నాలజీని కలిగి ఉంది. ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మెరుగైన ఫోటోలు తీయడానికి అనుమతిస్తుంది. ఇందుకోసం 1.12-మైక్రాన్ పిక్సెల్‌లు లేదా 2.24-మైక్రాన్ పిక్సెల్‌ల పరిమాణంలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ లేదా 12.5-మెగాపిక్సెల్ పిక్సెల్ సెన్సార్‌గా పనిచేయడానికి అనుమతిస్తుంది.

HDR

దక్షిణ కొరియా టెక్ కంపెనీ శామ్సంగ్ యొక్క ISOCELL HP3 సెన్సార్ స్మార్ట్-ISO ప్రో మెకానిజంను కలిగి ఉంది. ఇది స్పష్టమైన మరియు మెరుగైన HDR ఫోటోలను తీయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సెన్సార్ యొక్క డైనమిక్ పరిధిని విస్తరించడానికి ఇది ట్రిపుల్ ISO మోడ్‌ను అందిస్తుంది. ఈ టెక్నాలజీ 4 ట్రిలియన్ కలర్లతో (14-బిట్ కలర్ డెప్త్) ఫోటోలను వ్యక్తీకరించగలదు. అదనంగా ఈ సెన్సార్ స్మార్ట్-ISO ప్రో మరియు స్టాగర్డ్ HDR మధ్య కూడా మారడానికి అనుమతిని ఇస్తుంది. ISOCELL HP3 సెన్సార్ యొక్క నమూనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని కంపెనీ ధృవీకరించింది. ఈ కొత్త సెన్సార్ యొక్క భారీ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభమవుతుంది.

200-మెగాపిక్సెల్ సెన్సార్‌

దక్షిణ కొరియా టెక్ కంపెనీ శామ్సంగ్ 2023లో విడుదల చేయనున్న శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో 200-మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. 200-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయాలని చూస్తున్న ఇతర కంపెనీలలో మోటోరోలా మరియు షియోమి కంపెనీలు కూడా ఉన్నాయి. మోటోరోలా కంపెనీ నుంచి రాబోయే మోటోరోలా ఫ్రాంటియర్ కూడా 200-మెగాపిక్సెల్ కెమెరా కోసం శామ్సంగ్ యొక్క ISOCELL HP1 సెన్సార్‌ను ఉపయోగించనున్నట్లు భావిస్తున్నారు. అయితే షియోమి మాత్రం తన మొదటి 200-మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ను 2022 రెండవ భాగంలోనే లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Galaxy F13

Galaxy F13

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కూడా మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. ఇటీవల మార్కెట్లో Galaxy F13 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2408x1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది స్లిమ్ బెజెల్ మరియు 60hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే ఇది Exynos 850 ప్రాసెసర్‌తో రన్ అవుతూ ఆండ్రాయిడ్ 12 మద్దతుతో లభిస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB , ఇంకా 4GB RAM మరియు 128GB ఇంటర్ స్టోరేజ్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ఇది మెమరీ కార్డ్ ద్వారా 1TB వరకు నిల్వ సామర్థ్యాన్ని పొడిగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ప్లస్ ARM Mali G52 మద్దతు. ఫోన్‌లో ర్యామ్ ప్లస్ టెక్నాలజీ కూడా ఉంది.ఈ టెక్నాలజీ ద్వారా ఎక్కువ ర్యామ్‌ను అందించడానికి ఐడిల్ స్టోరేజీని ఉపయోగిస్తుంది.

శామ్సంగ్ LCD బిజినెస్ మూసివేత

శామ్సంగ్ LCD బిజినెస్ మూసివేత

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ 2020లోనే తన యొక్క LCD వ్యాపారాన్ని మూసివేయాలని ప్లాన్ చేసింది. అయితే COVID-19 మహమ్మారి ప్రభావంతో LCD ధరల పెరుగుదల కారణంగా కంపెనీ దానిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు ధరలు తగ్గాయి మరియు DSCC చూపిన విధంగా అవి తగ్గుతూనే ఉంటాయి. పెద్ద టీవీ స్క్రీన్‌ల కోసం శామ్సంగ్ తన LCD ప్యానెల్‌ల స్థానంలో OLED మరియు క్వాంటం డాట్ (QD) ప్యానెల్‌లపై మాత్రమే దృష్టి సారిస్తుందని చెప్పబడింది. LCD బిజినెస్ అనేది అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నందున దాని వెనుక గల గొప్ప శ్రామికశక్తి మొత్తం క్వాంటం డాట్ (QD) వ్యాపారానికి బదిలీ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
Samsung Announced ISOCELL HP3 200-Megapixel Image Sensor With Super QPD Auto-Focus Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X