50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో శాంసంగ్ బడ్జెట్ రేంజ్ ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. మరో బడ్జెట్ రేంజ్ ఫోన్‌ను ప్రకటించింది. తన A సీరిస్ ఫోన్.. గెలాక్సీ A14 5Gను ప్రకటించింది. ప్రీమియం డిజైన్, హై రిజల్యూషన్ డిస్‌ప్లే, వెనుక మూడు కెమెరాలు, ఆక్టాకోర్ చిట్‌సెట్ సహా ప్రీమియం ఫీచర్లను అందించింది. వీటితోపాటు నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని చెప్పింది.
శాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల పుల్ హెడ్+ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ Exynos 850 చిప్‌సెట్ ఆధారంగా పనిచేయనుంది. గెలాక్సీ A14 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13, One UI 5 ఆధారంగా పనిచేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇస్తామని, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ A14 5G రెండు వేరియంట్లలో లభించనుంది. 4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ మరియు 4GB ర్యామ్, 128 GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులో ఉండనుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 4GB వరకు పెంచుకొనే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలను కలిగి ఉంది. 50MP కెమెరా ప్రైమరీ సెన్సార్‌తోపాటు, 2MP ఆల్ట్రావైడ్, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
శాంసంగ్ గెలాక్సీ A14 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో రెండు రోజులపాటు ఛార్జింగ్ ఉంటుందని శాంసంగ్ చెబుతోంది. A14 5G ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అవి లేత ఆకుపచ్చ, నలుపు, వెండి రంగుల్లో ఫోన్ లభ్యం కానుంది.
4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999కు లభించనుంది. అదే 4GB ర్యామ్, 128 GB అంతర్గత స్టోరేజీ ఫోన్ ధర 14,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో Samsung.com సహా మరికొన్ని ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ఆఫర్ కింద రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 : ఈ సంవత్సరం తొలి భాగంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S23 ఆల్ట్రా లైమ్ కలర్ వేరియంట్‌ను సంస్థ గతవారం విడుదల చేసింది. అయితే భారత్‌లో తొలిసారిగా శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్ S23ను ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, పచ్చ, ఎరుపు రంగులతోపాటు గ్రాఫైట్, లైమ్ మరియు స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంచింది.
శాంసంగ్ S23 ఆల్ట్రా 6.1 అంగుళాల పుల్ హెచ్‌డీ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120 Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. గరిష్ట బ్రైట్‌నెస్ 1500ntsగా ఉండనుంది. అలాగే టచ్ 240 hz రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌తో వస్తుంది. దాంతోపాటు శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 CPU తో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ OneUI 5..1 సహా ఆండ్రాయిడ్ 13పై ఆధారపడి పనిచేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S23 ఆల్ట్రా లైమ్ కలర్ స్మార్‌ఫోన్ రెండు వేరియంట్లతో ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉండనుంది. 8GB ర్యామ్, 128GB ధర రూ.74,999, మరియు 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ ధర 79,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








