గుడ్‌న్యూస్ శాంసంగ్ చెప్పిన.. మీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఆ సమస్య ఉంటే స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉచితం..!
భారత్‌లోని శాంసంగ్ యూజర్లకు సంస్థ (Samsung india) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల అనేక మంది యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపింది. ప్రస్తుతం శాంసంగ్ కు చెందిన కొన్ని మోడళ్లలో గ్రీన్ లైన్ సమస్య ఉత్పన్నమవుతోంది. అంటే డిస్‌ప్లే పైన గ్రీన్ లైన్ కనిపిస్తోంది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఈ సమస్యను గుర్తించిన శాంసంగ్ ఆ హ్యాండ్‌సెట్‌లకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (Samsung Free Screen Replacement) చేస్తోంది. అయితే ఈ అంశంపై సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది.
శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ (Samsung Galaxy S21 Series), శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా (Galaxy S22 Untra), గెలాక్సీ S21 FE (ఫ్యాన్ ఎడిషన్) మోడళ్లలో (Galaxy S21 FE) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనంతరం గ్రీన్ లైన్ సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యపై శాంసంగ్‌కు అనేక మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి శాంసంగ్ ముందుకు వచ్చింది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనంతరం గ్రీన్ లైన్ సమస్య (Samsung smartphones Greenline problem) ఉన్న హ్యాండ్‌సెట్‌లకు ఒక్కసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేయాలని నిర్ణయించింది. అయితే భారత్‌లో ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గడువు సెప్టెంబర్ 30 తో ముగిసింది. తాజాగా శాంసంగ్ ఈ గడువును ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రకటన చేసింది. ఇందుకోసం శాంసంగ్ సర్వీస్ సెంటర్‌లను సంప్రదించాలని సూచించింది.
వన్‌ప్లస్ లోనూ ఇదే సమస్య :
ప్రస్తుతం భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S21, గెలాక్సీ S21+, గెలాక్సీ S21 అల్ట్రా మరియు శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G, శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ జాబితాలో ఉన్నాయి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇదే తరహా సమస్య ఎదురైంది. వన్‌ప్లస్ కూడా ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సర్వీసులను అందించింది.
ఇలా అయితేనే ఉచితం :
అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందేందుకు కొన్ని రూల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపు కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతోపాటు ఒరిజినల్ ఇన్‌వాయిస్‌ను కలిగి ఉండాలి. మరియు స్మార్ట్‌ఫోన్ ఫిజికల్ లేదా వాటర్ డ్యామేజీ జరగకుండా ఉండాలి.
* భారత్ మార్కెట్‌లోకి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ కానుంది. 2025 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్ హ్యాండ్‌సెట్‌ల వివరాలు ఇటీవల లీక్ అయ్యాయి. సిరీస్‌లోని అల్ట్రా మోడల్ స్పెసిఫికేషన్‌లు ఇటీవల లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ టైటానియం సిల్వల్, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్, టైటానియం గ్రే వంటి నాలుగు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications