మొట్టమొదటి వొంపు తిరిగిన వోఎల్ఈడి టీవీని ఆవిష్కరించిన సామ్‌సంగ్!

Posted By: Super

మొట్టమొదటి వొంపు తిరిగిన వోఎల్ఈడి టీవీని ఆవిష్కరించిన సామ్‌సంగ్!

 

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2013లో భాగంగా సామ్‌సంగ్ వినూత్న ఆవిష్కరణకు మంగళవారం శ్రీకారం చుట్టుంది. ప్రపంచపు తొలి వొంపు (కర్వుడ్) తిరిగిన వోఎల్ఈడి టెలివిజన్‌ను ఈ వేదిక పై సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ కొత్త తరహా టెలివిజన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫీచర్లు యూజర్ వీక్షణ అనుభూతులను మరింతగా రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి వీక్షించే సన్నివేశాలు రియాల్టీ భావనకు లోను చేస్తాయని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీవీ ద్వారా ఖచ్చితమైన వీడియో అనుభూతులను ఏ కోణం నుంచైనా ఆస్వాదించవచ్చు.

ఎల్‌జి స్మార్ట్ ఎల్ఈడి టీవీ:

ఈ ప్రతిష్టాత్మక ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో భాగంగా ఎల్‌జి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) స్మార్ట్‌టీవీలను ప్రదర్శించే యోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్ఈడి, యూహెచ్‌డి, 4కె శ్రేణి టీవీలను ఎల్‌జి ప్రకటించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot