క్యాన్సర్ బారీన శాంసంగ్ ఉద్యోగులు, కంపెనీ స్పందన ఏంటంటే..
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్నదక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ కి ఉద్యోగుల నుంచి ఊహించని షాక్ ఎదురయింది.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్నదక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ కి ఉద్యోగుల నుంచి ఊహించని షాక్ ఎదురయింది. తమ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు క్యాన్సర్ బారీన పడటం ఆ కంపెనీకి నిజంగా కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఈ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన శాంసంగ్ ఎట్టకేలకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. తమ ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా కొంతమంది ఉద్యోగులు క్యాన్సర్ బారిన పడుతున్నారని అంగీకరించిన సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. తద్వారా దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది.

శాంసంగ్ ఎల్‌సీడీ, సెమీ కండక్టర్ కర్మాగారాల్లో....
శాంసంగ్ ఎల్‌సీడీ, సెమీ కండక్టర్ కర్మాగారాల్లో కార్మికుల భద్రత కోసం సరియైన రక్షణచర్యలు తీసుకోలేకపోయామని ఈ ప్రకటన అనంతరం శాంసంగ్ వెల్లడించింది.

వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు....
వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని శాంసంగ్ కో ప్రెసిడెంట్ కిమ్ కి నామ్ ప్రకటించారు.

ఒక్కో బాధితుడికి సుమారు 9లక్షల రూపాయలు....
ఇది చాలా బాధాకర పరిణామమని దీనిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఒక్కో బాధితుడికి సుమారు 9లక్షల రూపాయలు (133వేల డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించారు. దీంతో గత పదేళ్లుగా పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులు శాంతించారు.

శాంసంగ్ క్షమాపణలు చెప్పడంపై బాధిత మహిళ ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ‍్యక‍్తం చేశారు ....
శాంసంగ్ క్షమాపణలు చెప్పడంపై ఉద్యమ కారుల్లో ఒకరు, బాధిత మహిళ ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ‍్యక‍్తం చేశారు. తన 22 కుమారుడు 2007లో లుకేమియాతో కన్నుమూశాడని, కంపెనీ క్షమాపణ కుటుంబాల బాధను ఏ మాత్రం తీర్చలేదని తెలిపారు.

పరిహారం కుటుంబాలకు సరిపోదని....
సంస్థ ప్రకటించిన పరిహారం కుటుంబాలకు సరిపోదని అయితే కంపెనీ పశ్చాతాపంతో క్షమాపణలు చెప్పినందున తాము అంగీకరిస్తున్నామన్నారు. తమ బంధువుల మరణంతో , తాము అనుభవించిన వేదన ఎన్నటికీ తీరనిదనీ, చాలా కుటుంబాలది ఇదే పరిస్థితని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దక్షిణ సియోల్‌లోని సువాన్‌లో శాంసంగ్....
కాగా దక్షిణ సియోల్‌లోని సువాన్‌లో శాంసంగ్ నెలకొల్పిన సెమీకండక్టర్, ఎల్‌సీడీ ఫ్యాక్టరీ వివాదానికి దారితీసింది. అనేకమంది అతిప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నామంటూ ఉద్యోగులు 2007లో పోరాటానికి దిగారు.

320 మంది ఉద్యోగులు క్యాన్సర్ బారినపడగా....
దాదాపు 320 మంది ఉద్యోగులు క్యాన్సర్ బారినపడగా, 118 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్‌లు వ్యాప్తి చెందాయి.

ఇతర అరుదైన తీవ్ర అనారోగ్యంతోపాటు....
అలాగే కొన్ని ఇతర అరుదైన తీవ్ర అనారోగ్యంతోపాటు, గర్భస్రావాలు, కార్మికుల పిల్లలు తీవ్రమైన కంటి రోగాల బారిన పడ్డారని ఉద్యమ కమిటీ వాదించింది.


Click it and Unblock the Notifications