చైనా యూజర్లకు సామ్‌సంగ్ క్షమాపణ

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తమ మొబైల్ ఫోన్‌లలో తలెత్తిన పలు సాంకేతిక సమస్యల కారణంగా చైనా వినయోగదారులకు క్షమాపణ చెప్పవల్సి వచ్చింది.

 చైనా యూజర్లకు సామ్‌సంగ్ క్షమాపణ

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇంటర్నల్ మెమరీ కార్డుల కారణంగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఇంకా గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో తలెత్తిన పలు సాఫ్ట్‌వేర్ సమస్యలను ఎత్తిచూపుతూ చైనా జాతీయ మీడియా ‘చైనా సెంట్రల్ టెలివిజన్' 25 నిమిషాల ప్రత్యేక కథనాన్ని సోమవారం ప్రసారం చేసింది. ఈ ప్రసారం పై స్పందించిన సామ్‌సంగ్ చైనా సామ్‌సంగ్ యూజర్లను క్షమాపణ కోరుతూ సాంకేతిక సమస్యకు గురైన హ్యాండ్‌సెట్‌లను ఉచితంగా రిపేర్ చేసుందుకు మందుకొచ్చింది.

గతంలో చైనా సెంట్రల్ టెలివిజన్ యాపిల్ వారంటీ పాలసీలను విమర్శిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం పై స్పందించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ క్షమాపణ కోరటం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot