హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న సామ్‌సంగ్

Posted By:

సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్‌కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న సామ్‌సంగ్ డాటా సిస్టమ్స్ ఇండియా, హైదరాబాద్‌లో చేపడుతున్న ఎల్ అండ్ టి మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ వ్యవస్థ ఏర్పాటుకు గాను కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే తరహా వ్యవస్థను సామ్‌సంగ్ డాటా సిస్టమ్స్ ... బీజింగ్, డాజీన్, ఢిల్లీ, బెంగుళూరు, జైపూర్ మెట్రో ప్రాజెక్ట్‌లలో అమలు చేసింది.

ఈ ఆటోమేటెడ్ టికెటింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేయటం ద్వారా ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరునుంది. ప్రయాణంలో భాగంగా ప్రయాణీకులుకు స్మార్ట్‌కార్డ్ ఆధారిత టికెటింగ్, స్లిమ్ ఆటోమెటిక్ గేట్స్ వంటి ఆధునిక వసతులు సమకూరునున్నాయి. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సౌలభ్యతతో టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న సామ్‌సంగ

ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయటం ద్వారా ఒకే స్మార్ట్‌కార్డ్ సాయంతో అన్నిరకాల ప్రయాణాలను భాగ్యనగర వాసులు చేయవచ్చని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ ముఖ్య నిర్వహణాధికారి వీబీ గాడ్గిల్ అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot