ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా శ్యామ్‌సంగ్!

Posted By: Staff

ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా శ్యామ్‌సంగ్!

శ్యామ్‌సంగ్ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా మొబైల్స్ ఫోన్స్ రంగంలో వినిపిస్తున్న పేరు. ఇది మాత్రమే కాకుండా 2011 మూడవ క్వార్టర్‌లో శ్యామ్‌సంగ్ ప్రపంచంలో కెల్లా పెద్ద స్మార్ట్ ఫోన్స్ వెండర్‌గా అవతరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనితోపాటు పద్నాలుగు సంవత్సరాలుగా నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్న మొబైల్ తయారీ దారు నోకియాని కూడా వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్దానాన్ని ఆక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు.

ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ప్రకారం ఆపిల్ కూడా రాబోయే క్వార్టర్‌లో నోకియాని అధిగమించవచ్చునని భావిస్తున్నారు. దీనికి కారణం ఆపిల్ కంపెనీ ఐఓయస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లలో తిరిగి తన హావాని కోనసాగించడమే. కానీ ప్రస్తుతానికి విదేశాలలో మార్కెట్లో నోకియానే నెంబర్ వన్‌గా కోనసాగుతుంది. దీనితోపాటు ప్రపంచంలో కెల్లా ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేసే సంస్దగా కూడా నోకియా రికార్డు సాధించింది. ఇటీవలే నోకియా కంపెనీ తన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు వెళ్శడానికి గాను మైక్రోసాప్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ముఖ్యంగా నోకియా మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తయారు చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ నార్త్ అమెరికా, యూరప్‌లలో విక్రయించాలని చూస్తుంది. అందుకు నోకియాకి అక్కడ మంచి మార్కెట్ ఉండడమే. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో నోకియాని శ్యామ్‌సంగ్ స్వాధీనం చేసుకోనుందని వార్తలు రావడం జరిగింది. ఈ వార్తలపై స్పందించినటువంటి నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ అవన్ని రూమర్స్ అంటూ కోట్టి పారేశారు. నోకియా విండోస్ ఫోన్ 7ని 2011 చివరలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సిఈవో వెల్లడించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot