గెలాక్సీ నోట్2 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం..

Posted By: Super

గెలాక్సీ నోట్2 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం..

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ముందస్తు బుకింగ్‌లు ‘సామ్‌సంగ్ ఇండియా ఈ-స్టోర్’లో ప్రారంభమయ్యాయి. ఔత్సాహికులు ముందస్తుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్గిబిషన్ వేదికగా ఆవిష్కరించబడని  గెలాక్సీ నోట్2 ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక

క్రేజ్‌ను ఏర్పరుచుకుంది. గెలాక్సీ నోట్2ను భారత్‌లో ఆవిష్కరించే క్రమంలో సామ్‌సంగ్ ఇండియా సెప్టంబర్ 27న హైదరాబాద్ వేదికగా ఓ

ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముందస్తు బుకింగ్‌లలో భాగంగా రూ.2399 విలువ చేసే డెస్క్‌టాప్ డాక్‌ను ప్రతీ కొనుగోలు పై ఉచితంగా అందించనున్నారు.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot