Samsung నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో స్లిడబుల్ ర్యాపరౌండ్ డిస్‌ప్లే కొత్త టెక్నాలజీ...

|

ప్రపంచం మొత్తం మీద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికప్పుడు విడుదల చేస్తూ సామ్‌సంగ్ సంస్థ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నది. ఇప్పుడు ఈ సామ్‌సంగ్ సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ a.k.a WIPOలో కొత్త స్మార్ట్‌ఫోన్‌కు పేటెంట్ పొందింది. ఇది డివైస్ చుట్టూ సౌకర్యవంతమైన స్లైడింగ్ డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంది. పేటెంట్ యొక్క వివరణ ప్రకారం సామ్‌సంగ్ సంస్థ నుంచి రాబోయే కొత్త ఫోన్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మెయిన్ డిస్‌ప్లే యొక్క పొడిగింపుగా బ్యాక్ ప్యానెల్ మధ్యలో పక్కకు ఉండేలా కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్లిడబుల్‌గా కనిపిస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

 

శామ్సంగ్

శామ్సంగ్ బ్రాండ్ నుంచి రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన డిజైన్ లీక్ అయ్యాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం ఫోన్ వెనుకభాగంలో రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో సెల్ఫీ కెమెరాను చూపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వెనుక కెమెరాను కూడా సెల్ఫీ షూటర్‌గా ఉపయోగించడానికి వీలు అవుతుంది. అదనంగా స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో కర్వ్డ్ ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉండి ఇది వెనుక కవర్‌లో కొంత భాగాన్ని కూడా కవర్ చేస్తూ విస్తరించి ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?

శామ్సంగ్ డబుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌
 

శామ్సంగ్ డబుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌

శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ కొత్తగా డబుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. అంటే ఇది ఒకేసారి రెండు దిశలలో ఫోల్డ్ చేయవచ్చు మరియు ఓపెన్ చేయవచ్చు. ఫోల్డబుల్ ఫోన్‌లోని మూడు డిస్‌ప్లే భాగాలకు మద్దతు ఇవ్వడానికి రెండు కీలు ఉంటాయి. పూర్తిగా ఓపెన్ చేయబడినప్పుడు డ్యూయల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను టాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు డిస్‌ప్లేలు ఉన్నకారణంగా అవి రెండు హింగ్‌ల సహాయంతో ఫోల్డ్ చేయగలవు. వీటిలో ఒక భాగం లోపలికి ఫోల్డ్ చేయబడుతుంది మరియు మరొక భాగం Z- లాంటి ఆకారంతో ఫోల్డ్ చేస్తుంది. అలాగే శామ్సంగ్ డబుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది HDMI పోర్ట్‌ను కలిగి కలిగి ఉండి S పెన్‌ మద్దతుతో రానున్నట్లు పేటెంట్ పేర్కొంది.

శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్4 స్మార్ట్‌ఫోన్‌

శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్4 స్మార్ట్‌ఫోన్‌

శామ్సంగ్ సంస్థ తన తదుపరి జెనరేషన్ ఫోల్డ్4 స్మార్ట్‌ఫోన్‌ని 2022 క్యూ3లో ఇంటర్నల్ మరియు ఎక్సటర్నల్ స్క్రీన్‌లతో మెరుగైన అండర్ డిస్‌ప్లే కెమెరా (UDC)తో ప్రారంభించాలని యోచిస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్4ని మార్కెట్‌లో ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఫోన్ల యొక్క కెమెరా నాణ్యతతో సమానంగా తీసుకురావడానికి ప్రైమరీ కెమెరా సెటప్ ను కూడా అప్‌గ్రేడ్ చేయబడుతోంది. రాబోయే గెలాక్సీ ఫోల్డ్ 4 ఫోన్ తక్కువ బరువుతో వస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఫోన్ మెరుగైన నీటి నిరోధకత మరియు ధూళి-నిరోధక ధృవీకరణను కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Brand Upcoming Foldable Smartphone Comes With Slidable Wraparound Sliding Display Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X