"ఇప్పుడు కొనండి.. త‌ర్వాత చెల్లించండి" Samsung స‌రికొత్త ఆలోచ‌న‌!

|

ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ Samsung భార‌త్‌లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. అంతేకాకుండా, త‌మ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌పై వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు విభిన్న‌ ప్ర‌య‌త్నాలు కూడా చేస్తోంది. తాజాగా ఆ కంపెనీ భార‌త్‌లో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు కంపెనీకి చెందిన‌ ఫ్లాగ్‌షిప్, ఫోల్డ‌బుల్ మొబైల్స్‌పై "Buy now, pay later (ఇప్పుడు కొనండి.. త‌ర్వాత చెల్లించండి) ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం ICICI క్రెడిట్ కార్డుదారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌ను పొంద‌డానికి ICICI క్రెడిట్ కార్డుదారులు సామ్‌సంగ్ రిటైల్ అవుట్‌లెట్ల‌ను సంప్ర‌దించాల‌ని వెల్ల‌డించింది.

 

ఆ ఆప్ష‌న్ ఎంచుకున్న వినియోగ‌దారులు కొనుగోలు చేసిన ప్రోడ‌క్ట్ పై 60శాతం పేమెంట్‌ను 18 నెల‌ల్లో మంత్లీ పేమెంట్ గా చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర‌వాత మిగిలిన 40శాతం పేమెంట్ బుల్లెట్ పేమెంట్ మాదిరి 19వ నెల‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ICICI బ్యాంక్ నుంచి కనీసం రూ.1,50,000 క్రెడిట్ పరిమితిని కలిగి ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు మాత్ర‌మే... తమ కొత్త Samsung "ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి" ఆప్ష‌న్ పొంద‌డానికి అర్హుల‌ని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త కొనుగోలు ఆప్ష‌న్‌తో, వినియోగదారులు Samsung Galaxy S22 సిరీస్, Samsung Galaxy Z Fold 3 మరియు Galaxy Z Flip 3 వంటి స్మార్ట్‌ఫోన్‌లను జీరో డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా.. కేవలం 1 శాతం కనీస ప్రాసెసింగ్ ఛార్జీ తో Samsung ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను సొంతం చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా.. అద‌నంగా బై నౌ, పే లేటర్ ఆఫర్ తో ఎవ‌రైనా Samsung Galaxy S22 Ultra 5Gని కొనుగోలు చేస్తే వారికి మ‌రో ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది. కంపెనీకి చెందిన గెలాక్సీ వాచ్ 4ని కేవ‌లం రూ. 2,999కి పొందవచ్చు. అంతేకాకుండా.. Samsung Galaxy S22+ 5G లేదా Galaxy S22 5Gని కొనుగోలు చేసే వారు గెలాక్సీ బడ్స్ 2 ను రూ.2,999కి పొందవచ్చు.

Samsung Galaxy S22 సిరీస్ మొబైల్స్ లో Samsung Galaxy S22 ధ‌ర రూ. 72,999 నుండి ప్రారంభమవుతుంది మరియు Galaxy S22 అల్ట్రా యొక్క బేస్ వేరియంట్ ధ‌ర రూ. 1,09,999 వరకు ఉంటుంది. మరోవైపు Samsung ఫోల్డ‌బుల్స్ Galaxy Z Flip 3 ధ‌ర రూ. 84,999 నుండి ప్రారంభమవుతుంది. Samsung Galaxy Z Fold 3 భారతదేశంలో రూ. 1,49,999 నుండి ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండ‌గా.. సామ్‌సంగ్ కంపెనీ త‌మ నెక్స్ట్ జెన‌రేష‌న్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆగస్టు 10న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేయనుంది. Samsung Galaxy Z Fold 4 మరియు Galaxy Z Flip 4 ల‌ను విడుద‌ల చేయ‌నుంది. రాబోయే ఫోల్డ‌బుల్స్ పాత మోడ‌ల్స్‌తో పోలిస్తే అనేక మెరుగైన ఫీచ‌ర్ల‌తో వస్తాయని పేర్కొంది.

ఇప్పుడు Samsung లో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన‌ Samsung Galaxy S22 Ultra 5G ప్ర‌త్యేక‌త‌ల గురించి తెలుసుకుందాం:
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల full-HD + డైనామిక్‌ AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 120Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత One UI 4.1 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm SM8450 Snapdragon 8 Gen 1 (4 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

 

ఈ మొబైల్ 8GB,12GB RAM| 128GB,128GB,1టీబీ స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ నాలుగు కెమెరాల‌ సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో మూడింటిలో 10 మెగాపిక్సెల్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌, మ‌రొక‌టి 10 మెగా పిక్సెల్ క్వాలిటీలో టెలిఫోటో లెన్స్, చివ‌రిది 12 మెగాపిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్ క‌లిగి ఉంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 40 మెగా పిక్సెల్ క్వాలిటీతో హై రిసోల్యూష‌న్ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, USB టైప్-C 3.2 పోర్ట్ స‌హా ప‌లు ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

ఇదిలా ఉండ‌గా.. Samsung కు చెందిన Samsung Galaxy S22 Ultra చాలా ఎక్కువ ధ‌ర క‌లిగిన‌ప్ప‌టికీ గ‌త ఏప్రిల్ నెల‌లో మంచి అమ్మ‌కాల‌ను న‌మోదు చేసింది. ఏప్రిల్ నెల‌లో గ్లోబ‌ల్ అత్య‌ధిక‌ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల జాబితాలో ఈ మొబైల్స్ 1.5శాతం షేర్‌తో 5వ స్థానంలో నిలిచాయి. ఈ Samsung Galaxy S22 Ultra మొబైల్స్ ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ప్ర‌స్తుతం Samsung Galaxy S22 Ultra (ఫాంటం వైట్‌)ను రూ.1,09,999కి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Samsung Brings 'Buy Now, Pay Later' Option For Flagships And Foldables In India: How To Avail Offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X