ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నశ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్

Posted By: Super

ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నశ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్

పోయిన సంవత్సరం డిసెంబర్‌లో ఇంటర్నేషనల్‌గా విడుదలైనటువంటి శ్యామ్‌సంగ్ నెక్సస్ యస్ చివరకు ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. నెక్సస్ యస్ అనేది శ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ జింజర్ బ్రీడ్ 2.3తో రన్ అవుతూ 1GHz Cortex A8 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక దీని డిప్లే విషయానికి వస్తే టచ్ స్క్రీన్ కలిగిఉండి స్క్రీన్ సైజు 480*800 పిక్సల్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దీనిపైనున్నటువంటి గ్లాస్ వంపులాంటి షేపుని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మొత్తం సెన్సార్స్, త్రి-యాక్సిస్ గైరోస్కోప్, ఎక్సిలోరోమీటర్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటి సెన్సార్ మరియు లైట్ సెన్సార్ కలిగి ఉంటడం దీని ప్రత్యేకత. ఇక ఫోన్ డేటా ఎన్‌ఎ‌ఎన్‌డి ఫ్లాష్ మొమొరి కార్డులో సేవ్ చేసకోవచ్చు. దీని కెపాసిటీ 16జిబి. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ఉన్నటువంటి కెమెరా 5మెగా ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. వీడియో కూడా 720 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌తో తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఫ్లాష్‌తో పాటు ముందు వైపు ఉన్నటువంటి కెమెరా విజిఎ కెమెరా. ఫోన్ బ్యాటరీ ప్యాకప్ 1500mAh. మీరు ఆరు గంటలు నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. అదే స్టాండ్‌బై టైమ్‌లో గనుక ఉంటే 18రోజులు బ్యాటరీ ప్యాకప్ వస్తుంది. ఇక దీని ఖరీదు ఇండియన్ మార్కెట్‌లో కేవలం రూ 29, 590.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot