Samsung కంపెనీ తన LCD బిజినెస్ ని క్లోజ్ చేయనున్నది!! ఎప్పుడు? ఎందుకు?

|

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఫోన్ స్క్రీన్‌ల విషయానికి వస్తే ఎల్లప్పుడూ అందరికంటే ముందుంటుంది. గతంలో కూడా కంపెనీ LCD ప్యానెల్‌లను తమ యొక్క ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర పరికరాలలో ఉపయోగించబడ్డాయి. అయితే ఇప్పుడు టీవీలు మరియు స్మార్ట్‌ఫోన్‌లలో OLED ఫీచర్ విస్తృతంగా ప్రజాదరణ పొందినప్పటి నుండి శామ్‌సంగ్ సంస్థ కూడా ఆధునిక OLED టెక్నాలజీని విసృతంగా ఉపయోగిస్తున్నది. కానీ LCD ప్యానెల్‌ల వినియోగం కూడా పరిమితంగానే ఉంది. కానీ ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం OLED మరియు క్వాంటం డాట్ (QD) టెక్నాలజీతో స్క్రీన్‌లను రూపొందించడంలో ఒక అడుగు ముందుకు వేయడంతో శామ్‌సంగ్ సంస్థ తన LCD యొక్క బిజినెస్ ని పూర్తిగా నిలిపివేయనున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

LCD ధరల పతనం

LCD ధరల పతనం

దక్షిణ కొరియా నుండి వచ్చిన నివేదిక ప్రకారం శామ్సంగ్ కంపెనీ తన లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే (LCD) బిజినెస్ ని ఈ సంవత్సరం జూన్‌ నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. చైనీస్ మరియు తైవాన్ కంపెనీలు చౌకైన ధరలో LCD ప్యానెల్‌లను అందించడం కూడా ఈ పోటీకి ఒక ప్రధాన కారణం. శామ్సంగ్ తన LCD-తయారీ వ్యాపారాన్ని ఈ నెలాఖరులో మూసివేస్తుందని భావించారు. అయినప్పటికీ మార్కెట్లో LCD ధరలు తగ్గడం వల్ల వేగంగా నష్టాల కారణంగా వ్యాపారాన్ని ముందుగానే నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

3 కోట్ల స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్న Samsung ! కారణం ఏంటో తెలుసుకోండి.3 కోట్ల స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్న Samsung ! కారణం ఏంటో తెలుసుకోండి.

DSCC
 

డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (DSCC) ప్రకారం LCD ప్యానెళ్ల సగటు ధర మరిదారుణంగా పడిపోయింది. 2014 నాటితో పోల్చితే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో LCD ప్యానెళ్ల ధర సూచిక 36.6 కంటే తక్కువకి తగ్గనున్నది. ఏప్రిల్‌లో దీని ధర 41.5గా ఉంది. ఇది LCD ధరల సూచికకు రికార్డు కనిష్టంగా పరిగణించబడింది. శామ్సంగ్ డిస్ప్లే దాని LCD లైనప్‌ను మూసివేయడానికి గల మరొక కారణం విషయానికి వస్తే దాని అతిపెద్ద కొనుగోలుదారులు. Samsung Electronics BOE టెక్నాలజీ గ్రూప్ మరియు AU Optronics Corp వంటి చైనీస్ మరియు తైవాన్ కౌంటర్‌పార్ట్‌ల నుండి స్క్రీన్‌లను తీసుకుంటోంది. ఇది ఆ విధంగా చౌకగా కనిపిస్తుంది.

LCD ప్యానెల్‌

శామ్సంగ్ కంపెనీ 2020లోనే తన యొక్క LCD వ్యాపారాన్ని మూసివేయాలని ప్లాన్ చేసింది. అయితే COVID-19 మహమ్మారి ప్రభావంతో LCD ధరల పెరుగుదల కారణంగా కంపెనీ దానిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు ధరలు తగ్గాయి మరియు DSCC చూపిన విధంగా అవి తగ్గుతూనే ఉంటాయి. పెద్ద టీవీ స్క్రీన్‌ల కోసం శామ్సంగ్ తన LCD ప్యానెల్‌ల స్థానంలో OLED మరియు క్వాంటం డాట్ (QD) ప్యానెల్‌లపై మాత్రమే దృష్టి సారిస్తుందని చెప్పబడింది. LCD బిజినెస్ అనేది అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నందున దాని వెనుక గల గొప్ప శ్రామికశక్తి మొత్తం క్వాంటం డాట్ (QD) వ్యాపారానికి బదిలీ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
Samsung Company Close to His LCD Business in June 2022: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X