ఇండియాలో టాబ్లెట్ మార్కెట్‌ వాటాలో అగ్రస్థానంలో శామ్‌సంగ్...

|

శామ్సంగ్ కంపెనీ అనేక సంవత్సరాలుగా భారతీయ టాబ్లెట్ మార్కెట్లో చాలా స్థిరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. ఇతర ఆండ్రాయిడ్ టాబ్లెట్ తయారీదారులు కొత్త టాబ్లెట్ల తయారీ విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ ప్రీమియం టాబ్లెట్ విభాగంలో తన యొక్క మనుగడ సాగించిన ఏకైక ఆండ్రాయిడ్ టాబ్లెట్ తయారీదారు శామ్సంగ్ మాత్రమే. కొత్తగా వచ్చిన నివేదిక ప్రకారం శామ్సంగ్ సంస్థ ప్రస్తుతం భారతీయ టాబ్లెట్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉంది. శామ్‌సంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ విభాగంలో ఆపిల్ కంపెనీని వెనుకకు నెట్టి ఆధిపత్యం చెలాయించడం గొప్ప విషయం.

శామ్సంగ్ టాబ్లెట్‌లు vs ఆపిల్ ఐపాడ్లు

శామ్సంగ్ టాబ్లెట్‌లు vs ఆపిల్ ఐపాడ్లు

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) ప్రకారం శామ్‌సంగ్ కంపెనీ Q1 2022లో భారతదేశంలో టాబ్లెట్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్నది. దక్షిణ కొరియా దిగ్గజం మార్కెట్ వాటాలో 40% వరకు సాధించగలిగింది. ఇది మునుపటి త్రైమాసికంలో అంటే Q4 2021 కంటే 10% వృద్ధిని నమోదు చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 సిరీస్ వంటి సరసమైన టాబ్లెట్‌లను విక్రయించడమే కాకుండా గెలాక్సీ ట్యాబ్ S8 లైనప్ వంటి ప్రీమియం టాబ్లెట్‌లను రవాణా చేయగలిగింది. ప్రీమియం మార్కెట్‌లో ఆపిల్ యొక్క ఐప్యాడ్ మోడల్‌లు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుఉండడం అనేది ఆసక్తికరంగా మారింది. కానీ శామ్సంగ్ బ్రాండ్ యొక్క గెలాక్సీ ట్యాబ్ S8 పరికరాలు కూడా బాగా అమ్ముడవుతున్నాయి.

గెలాక్సీ ట్యాబ్

"మార్కెట్ లో ఇటీవల లాంచ్ చేయబడిన గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్ మరియు గెలాక్సీ ట్యాబ్ A8 సిరీస్‌లకు అధికంగా జనాదరణ పొందడంతో టాబ్లెట్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగడానికి మరియు బ్రాండ్ వాల్యూ మరింత బలోపేతం చేయడానికి మాకు సహాయపడింది. గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్ యొక్క విజయంలో ముఖ్యంగా గెలాక్సీ ట్యాబ్ S8 అల్ట్రా యొక్క పాత్ర అధికంగా ఉంది. వినియోగదారులు తమ రోజువారీ పనులను సమర్థవంతంగా పరిష్కరించే అర్ధవంతమైన ఆవిష్కరణలకు విలువ ఇస్తారనే దానికి ఇది నిదర్శనం. బడ్జెట్ ధరల విభాగాల్లో పరికరాల లభ్యత మరియు వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రోగ్రామ్‌లు అందించడం వలన మా నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడంలో మాకు సహాయపడింది" అని Samsung ఇండియాకు చెందిన సందీప్ పోస్వాల్ అన్నారు.

ట్యాబ్లెట్ల

కొన్ని నివేదికల ప్రకారం లాక్ డౌన్ల కారణంగా పాఠశాలలు వర్చువల్ పద్దతిలో విద్యార్థుల కోసం తరగతులను నిర్వహించాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే ఆఫీసుల మీటింగులను అధికంగా నిర్వహించాయి. వీటి కారణంగా భారతదేశంలో చాలా మంది వ్యక్తులు వర్చువల్ తరగతులు మరియు సమావేశాలకు హాజరు కావడానికి చిన్న ఫోన్ స్క్రీన్‌ల నుండి టాబ్లెట్‌కి మారారు. ఇలా ట్యాబ్లెట్ల వినియోగం మరింతగా పెరుగుతుందని తెలుస్తోంది. అలాగే షియోమి మరియు రియల్‌మి వంటి మరిన్ని ప్లేయర్‌లు బ్యాండ్‌వాగన్‌లో దూసుకుపోతున్నందున రాబోయే నెలల్లో భారతీయ టాబ్లెట్ మార్కెట్ వేగంగా మారుతుంది అని వినియోగదారులు భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Samsung Company Leads The Indian Tablet Market With 40% Share: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X