Home
News

పరీక్షలన్నీ పూర్తి చేసిన శాంసంగ్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌

By Gizbot Bureau

స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికులను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న మడత ఫోన్‌ (ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌) విడుదల విషయమై శాంసంగ్‌ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్లలో దీనిని ఆవిష్కరించనున్నామని దక్షిణ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తెలిపింది. శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌‌ఫోన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో త్వరలోనే దీన్ని తిరిగి ప్రారంభించనుంది.

Samsung confirms Galaxy Fold launch coming soon

గెలాక్సీ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి మార్పులతో రూపొందించామని ఇది తాజాగా అన్ని రకాల కఠినమైన పరీక్షలను దాటిందని సంస్థ తెలిపింది. తుది పరీక్షల అనంతరం 2019 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్లలో ఆవిష్కరించనున్నామని దక్షిణ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజాగా ధృవీకరించింది.

 డిస్‌ ప్లే కింద అదనంగా మెటల్‌ లేయర్స్‌

డిస్‌ ప్లే కింద అదనంగా మెటల్‌ లేయర్స్‌

స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌, సెక్యూరిటీ ఫీచర్లలో మార్పులు, ఇతర కఠినమైన పరీక్షలను పూర్తి చేయడానికి సమయం పట్టిందని శాంసంగ్‌ పేర్కొంది. ప్రధానంగా అరచేతిలో సులువుగా ఇమిడిపోయేలా రూపొందించడంతోపాటు ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ ప్లే కింద అదనంగా మెటల్‌ లేయర్స్‌ని అమర్చింది. ఇతర భద్రతా పరమైన మార్పులకు తోడు మరిన్ని యాప్స్‌ను మరింత గరిష్టం చేసింది.

త్వరలో ఫీచర్లు విడుదల

త్వరలో ఫీచర్లు విడుదల

విడుదల సందర్భంగా లభ్యత, ఇతర కీలక ఫీచర్లను వెల్లడిస్తామని శాంసంగ్‌ వెల్లడించింది. ముందుగా ఇండియా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లలో ఈ ఫోన్‌లను లాంచ్‌ చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ధర రూ. 1,41,300గా ఉండే అవకాశం

ధర రూ. 1,41,300గా ఉండే అవకాశం

కాగా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్రీన్, బ్లూ, సిల్వర్, బ్లాక్ నాలుగు రంగుల్లో రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన దేశాల్లో ఏప్రిల్ 26, 2019 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది.అయితే ఫిర్యాదుల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వచ్చింది. 4జీ ఎల్టీఈ, 5జీ వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,41,300గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు

గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్‌ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇది చేస్తుంది. మొత్తం ఆరు కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది .

7 ఎన్ఎం ప్రాసెసర్

12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ

16+8+12 ఎంపీ ఔట్‌ సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా

10+8+10 ఎంపీ ఇన్‌సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా

4380 ఎంఏహెచ్ బ్యాటరీ

 

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung confirms Galaxy Fold launch coming soon; India could be first
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X