Home
News

Samsung ఫోల్డబుల్‌ ఫోన్లకు భారీ డిమాండ్‌.. 1.5 లక్షల ముందస్తు బుకింగ్‌లు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన ఫోల్టింగ్ ఫోన్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఇటీవల లాంచ్‌ చేసిన గెలాక్సీ Z Flip మరియు గెలాక్సీ Z Fold 5 స్మార్ట్‌ఫోన్ల ముందస్తు బుకింగ్‌ల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు శాంసంగ్‌ వెల్లడించింది.

ఈ రెండు శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు 1.5 లక్షల ముందస్తు బుకింగ్‌లు వచ్చినట్లు తెలిపింది. జులై 27, 2023 నుంచి ఆగస్టు 17 మధ్య కాలంలో ప్రీ బుకింగ్‌లను స్వీకరించినట్లు శాంసంగ్‌ తెలిపింది. టైర్‌-1, టైర్‌-2 నగరాల నుంచి భారీ డిమాండ్‌ను గమనించినట్లు శాంసంగ్‌ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే 1.4 రెట్లు ఎక్కువ అభివృద్ధి నమోదుచేసినట్లు తెలిపింది.

Samsung Creates record by 150000 lakh pre bookings

టైర్-3, టైర్‌-4 నగరాల్లోనూ ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లపై ప్రజలు ఆసక్తి చూపారని తెలిపింది. ప్రస్తుతం గెలాక్సీ Z Filp మరియు గెలాక్సీ Fold 5 స్మార్ట్‌ఫోన్లు దేశవ్యాప్తంగా సుమారు 10 వేల రిటైల్‌ అవుట్‌లెట్‌లో అందుబాటులో ఉంచినట్లు శాంసంగ్‌ తెలిపింది. శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్లు డిస్‌ప్లే, పనితీరు, ఇతర ఫీచర్ల ఆకట్టుకుంటున్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫ్లిప్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే, 3.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఫోల్డర్‌ ఆకారపు ఔటర్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 7.6 అంగుళాల QXGA+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X ఇన్ఫినిటీ ప్లెక్స్‌ ఇన్నర్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 6.2 అంగుళాల పుల్‌ HD+ కవర్‌ స్క్రీన్‌తో వస్తుంది.

ఈ శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా One UI 5.1.1పైన పనిచేస్తాయి. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ఆధారంగా పనిచేస్తాయి. గెలాక్సీ ఫ్లిప్‌ 5లో వెనుకవైపు డ్యూయల్‌ 12MP కెమెరా సెన్సార్లు, ముందువైపు 10MP కెమెరాను కలిగి ఉంటుంది.

గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఔటర్‌ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా, లోపలి డిస్‌ప్లేలో 4MP అండర్‌ డిస్‌ప్లే కెమెరాలను కలిగి ఉంది.

ఈ రెండు ఫోన్లు నీరు, డస్ట్ రక్షణకు IPX8 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. గెలాక్సీ ఫ్లిప్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 3700mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 4400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ 2.0, 25W వైర్డ్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.

గెలాక్సీ Z ఫ్లిప్‌ 5 గ్రాఫైట్, లావెండర్, మింట్‌ కలర్ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో బ్లూ, గ్రే, గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫోల్డ్‌ ఫోన్‌ క్రీమ్‌, ఐస్‌ బ్లూ, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 1TB స్టోరేజీ వేరియంట్‌ ఐస్‌ బ్లూ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ కింద.. శాంసంగ్‌ గెలాక్సీ ఫ్లిప్‌ 5 256 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.85,999కు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 5 ఫోన్‌ 256 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,38,999కు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Creates record by 150000 lakh pre bookings of Galaxy Z flip 5 and Fold 5 smartphones in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X