Home
News

Samsung 4k TV శాంసంగ్ నుంచి 4K టీవీలు విడుదల... మెరుగైన ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

శాంసంగ్‌ సంస్థ ఇటీవల కాలంలో వరుసగా స్మార్ట్‌ ఫోన్లతోపాటు స్మార్ట్‌ టీవీలను కూడా విడుదల చేస్తోంది. తన ఫోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తోంది. తాజాగా క్రిస్టల్‌ 4K TV సిరీస్‌ను (Samsung Crystal 4K TV 2024) భారత్‌లో లాంచ్‌ చేసింది.

ఈ శాంసంగ్‌ కొత్త సిరీస్‌లో క్రిస్టల్‌ 4K Vivid, క్రిస్టల్‌ 4K, విజన్ ప్రో మరియు క్రిస్టల్‌ 4K Vivid ప్రో టీవీలు ఉన్నాయి. శాంసంగ్‌ క్రిస్టల్‌ విజన్‌ 4K టీవీ సిరీస్‌ అనేక వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల పరిమాణాల్లో కొనుగోలు చేయవచ్చు.

samsung crystal 4k tv series launched in india details

శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఇతర ఆన్‌లైన్‌ స్టోర్‌లలోనూ ఈ శాంసంగ్‌ కొత్త సిరీస్‌ 4K టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్‌ ప్రారంభ ధర రూ.32,990 ఉంది. ఈ కొత్త సిరీస్‌ ద్వారా మెరుగైన విజువల్ అనుభూతి కలుగుతుందని శాంసంగ్‌ తెలిపింది. శాంసంగ్‌ టీవీ ప్లస్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్‌ iOT హబ్‌ను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్ కొత్త టీవీ సిరీస్‌ 4K అప్‌ స్కేలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టీవీల రిజల్యూషన్‌తో తగిన విధంగా ఉండేందుకు తక్కువ రిజల్యూషన్‌ వీడియోను మెరుగుపరుస్తుంది. శాంసంగ్‌ టీవీ ప్లస్‌లో భారత్‌లో 100 ఛానళ్లు ఉన్నట్లు సంస్థ చెబుతోంది.

samsung crystal 4k tv series launched in india details

ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌, యాంబియంట్‌ ఫీచర్లతో స్మార్ట్‌హోం అనుభూతిని కలిగిస్తుంది. ఈ సిరీస్‌ ప్యూర్‌ కలర్‌ మరియు HDR10+ ప్లేబ్యాక్‌తో అల్ట్రా HD ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ఇవి 16 bit 3D కలర్‌ మ్యాపింగ్ అల్గారిథమ్‌తో పనిచేస్తాయి. మరియు డాల్బీ డిజిటల్‌ ప్లస్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఈ శాంసంగ్‌ క్రిస్టల్‌ 4K వివిడ్‌ ధర రూ.32990 గా ఉంది. అదే క్రిస్టల్‌ 4K విజన్ ప్రో బేస్‌ వేరియంట్‌ ధర రూ.34,000 గా ఉంది. అలాగే క్రిస్టల్‌ 4K వివిడ్‌ ప్రో బేస్‌ వేరియంట్ ధర రూ.35,990 గా ఉంది. అమెజాన్ మరియు శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

samsung crystal 4k tv series launched in india details

దీంతోపాటు శాంసంగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత (Samsung AI TV) టీవీలను భారత్‌లో ఏప్రిల్‌ 17న ఆవిష్కరించనుంది. ఈ AI టీవీలను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. శాంసంగ్‌ అధికారిక వెబ్‌ సైట్‌ లేదా స్టోర్‌లో రూ.5000 చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు.

శాంసంగ్‌ నియో QLED 8K సిరిస్‌ 75 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న టీవీని ముందస్తు బుకింగ్ చేసుకుంటే రూ.15000 వరకు ప్రయోజనాలు పొందుతారు. అదే శాంసంగ్‌ QLED 4k మరియు OLED సిరీస్‌ లను ముందస్తు బుకింగ్ చేసుకొనే వారు రూ.10000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందుతారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung crystal 4k tv series launched in india here are the key specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X