ఇకపై మెదడుతోనే Tv ఆపరేట్ చేయవచ్చు,శాంసంగ్ భారీ షాక్ !

|

శాంసంగ్ దిమ్మతిరిగే టెక్నాలజీతో దిగ్గజాలకు భారీ షాక్ ఇవ్వబోతోంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఏదో ఓ రోజు యూజర్లు తమ ఇంట్లోని టీవీలను మెదడు ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. రిమోట్ అవసరం లేకుండా కేవలం మెదడు ద్వారానే టీవీకి సంకేతాలను పంపి టీవీ వాల్యూంని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఛానల్స్ ని మార్చవచ్చు. ఈ విప్లవాత్మక ప్రయోగానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ శ్రీకారం చుట్టింది. స్విట్జర్లాండ్ లోని Center of Neuroprosthetics of the Ecole Polytechnique Fédérale de Lausanne (EPFL) సహాయంతో శాంసంగ్ ఈ ప్రాజెక్టుపై ప్రయోగత్మాకంగా పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ రెండింటి మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరినట్లు తెలుస్తోంది.

 

నచ్చిన అమ్మాయిని వశం చేసుకోవడానికి గుడ్లగూబను బలి ఇచ్చిన వ్యక్తి

టీవీని కంట్రోల్ చేయడమే కాకుండా...

టీవీని కంట్రోల్ చేయడమే కాకుండా...

టీవీని కంట్రోల్ చేయడమే కాకుండా ఇతర రకాలైన శారీరక పరీక్షలు జరపడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. quadriplegia అంటే ఇతరుల సహాయం లేకుండా తమకు నచ్చిన షోలను తిలకించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఓ డెవలపర్ సదస్సును కూడా నిర్వహించింది...

దీనికి సంబంధించి ఓ డెవలపర్ సదస్సును కూడా నిర్వహించింది...

శాన్ ప్రాన్సిస్కోలో గతవారం దీనికి సంబంధించి ఓ డెవలపర్ సదస్సును కూడా నిర్వహించింది. ఈ సదస్సులో వ్యక్తి ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా ఎదురుగా ఉన్న వాటిని మెదడుతో కంట్రోల్ ఎలా చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ విషయాన్ని EPFL సీనియర్ శాస్ర్తవేత్త Ricardo Chavarriaga తెలిపారు.

ఈ టెక్ మనుషులతో ఎలా కనెక్ట్ అవుతందనే విషయాన్ని...
 

ఈ టెక్ మనుషులతో ఎలా కనెక్ట్ అవుతందనే విషయాన్ని...

టెక్నాలజీ చాలా కొత్త మార్పులకు వేదికగా నిలుస్తోందని ఈ టెక్ మనుషులతో ఎలా కనెక్ట్ అవుతందనే విషయాన్ని మేము ఎప్పటికీ మరచిపోమని మనుషులకు టెక్నాలజీకి మధ్య ఉన్న సంబంధాన్ని మరింతగా అభివృద్ధి చేసి సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టీవీని కేవలం మెదడు సంకేతాల ద్వారా ఎలా కంట్రోల్ చేయాలనే...

టీవీని కేవలం మెదడు సంకేతాల ద్వారా ఎలా కంట్రోల్ చేయాలనే...

ఈ టెక్నాలజీలో భాగంగా ముందుగా టీవీని కేవలం మెదడు సంకేతాల ద్వారా ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నామని దీనికోసం ఓ హెడ్ సెట్ రూపొందిస్తున్నామని ఇందులో 64 సెన్సార్లను పొందుపరిచామని తెలిపారు. ఈ సెన్సార్ల ద్వారా కంటి కదలికలతోనే టీవిని ఆపరేట్ చేయవచ్చని తెలిపారు.

మెదడు టీవీని ఎలా చూడగలుగుతోంది...

మెదడు టీవీని ఎలా చూడగలుగుతోంది...

ఈ ప్రయోగంలో మెదడు టీవీని ఎలా చూడగలుగుతోంది. ఎటువంటి సంకేతాల ద్వారా మెదడు ఎలా రియాక్ట్ అవుతోంది. టీవీ చూసే సమయంలో అది ఎలా ప్రవర్తిస్తోంది అనే అంశాలపై శాంపిల్స్ సేకరించనున్నారు.

రిమోట్ సాయం లేకుండా...

రిమోట్ సాయం లేకుండా...

ఈ ప్రయోగం సఫలమైతే ఏదో ఓ రోజు మనిషే రిమోట్ సాయం లేకుండా కేవలం మెదడు ద్వారా టీవిని ఇతర పరికరాలను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాగా మెదడు ఆలోచనలు అందరికీ ఒకేలా ఉండకపోవడం కూడా సమస్యగా మారనుంది.

 ప్రత్యేకంగా ఓ సాప్ట్వేర్ ని రూపొందించనున్నారు...

ప్రత్యేకంగా ఓ సాప్ట్వేర్ ని రూపొందించనున్నారు...

దీని కోసం ప్రత్యేకంగా ఓ సాప్ట్వేర్ ని రూపొందించనున్నారు. ఈ సాప్ట్ వేర్ ద్వారా మెదడు లైవ్ స్ట్రీమ్ లో ఏ కంటెట్ ని ప్రాసెస్ చేస్తోంది. వ్యూయర్ ఫ్రొపైల్, సలహాలు లాంటి విషయాలను పరిగణిలోకి తీసుకోనున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Never worry about losing the remote again: Samsung developing TV controlled by your BRAIN More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X