Just In
Don't Miss
- News
citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం
- Lifestyle
మీ రాశిని బట్టి 2020లో ఏ నెల మీకు ప్రమాదకరమైన మరియు దురదృష్టకరమైన నెల అవుతుందో మీకు తెలుసా?
- Movies
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
- Automobiles
యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శామ్సంగ్ దీపావళి సేల్స్ : గెలాక్సీ సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు
ఇండియాలో అందరు చాలా బాగా జరుపుకొనే పండుగ దీపావళి. ఈ ఫెస్టివల్ సందర్బంగా అమెజాన్,ఫ్లిప్ కార్ట్ అందరు ప్రత్యేకమైన సేల్స్ నిర్వహించారు. శామ్సంగ్ కూడా ఇప్పుడు మళ్ళి తన ఆన్లైన్ స్టోర్ లలో దీపావళి సేల్స్ ను ప్రకటించింది. ఈ సేల్స్ సందర్బంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 మరియు గెలాక్సీ ఎం 10 లపై అద్భుతమైన డిస్కౌంట్ లను అందిస్తోంది.

శామ్సంగ్ తన ఆన్లైన్ స్టోర్ లలో ఇవే కాకుండా వివిధ స్మార్ట్ టీవీ మోడళ్లపై క్యాష్‌బ్యాక్ మరియు డిస్కౌంట్ లను కూడా అందిస్తోంది. అదేవిధంగా దీపావళి సేల్ కింద సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ 46mm పై కూడా ప్రత్యేక ధర అక్టోబర్ 25 వరకు ఉంటుంది. సామ్సంగ్ తన ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయిస్తుండడంతో గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ ఎస్ 10 మోడళ్లపై అద్భుతమైన పండుగ ఒప్పందాలను ప్రకటించింది.
వివో దీపావళి ఆఫర్.... వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 101లకే కొనవచ్చు

శామ్సంగ్ దీపావళి సేల్ కింద శామ్సంగ్ గెలాక్సీ M10sను ఇప్పుడు కేవలం రూ.7,999లకు పొందవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.8,999. అలాగే గెలాక్సీ నోట్ 9 యొక్క 128 జీబీ మోడల్ ను ఇప్పుడు కూడా శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్‌లో రూ.42,999ల ఆఫర్ ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ మొదట ఇండియాలో రూ.51,990 రిటైల్ ధర వద్ద విడుదల అయింది.

ఆఫర్స్
శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేసే వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇంకా కంపెనీ 10 శాతం మోబిక్విక్ సూపర్ క్యాష్ మరియు మేక్ మైట్రిప్ ద్వారా ట్రావెల్ బుకింగ్ లకు 25 శాతం వరకు తగ్గింపు కూపన్ లను అందిస్తుంది. ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు పాత స్మార్ట్ ఫోన్ మీద అదనపు ఎక్స్చేంజ్ కూడా లభిస్తుంది.

దీపావళి సేల్ సందర్బంగా శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ 46mm ను రూ. 23,990 ధర వద్ద పొందవచ్చు. ఇదే కాకుండా వివిధ స్మార్ట్ టీవీ మోడళ్లపై 50 శాతం వరకు ఆఫర్ ధర ఇస్తున్నట్లు శామ్సంగ్ పేర్కొంది. అదేవిధంగా ఎంపిక చేసిన AKG, హర్మాన్ కార్డాన్ మరియు JBL ఆడియో ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఉంది.

శామ్సంగ్ దీపావళి సేల్‌లో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లపై అద్భుతమైన పండుగ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 మోడళ్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా ఐదు శాతం అంటే రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్..... ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10ను కొనుగోలు చేయాలనీ చూస్తున్న వినియోగదారులకు SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన పండుగ ఆఫర్ ద్వారా సుమారు 6,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కంపెనీ అందిస్తున్న అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద పాత ఫోన్ మీద రూ.6,000 తగ్గింపు లభిస్తుంది.

శామ్సంగ్ దీపావళి సేల్‌లో భాగంగా గెలాక్సీ ఎస్ 10 లేదా గెలాక్సీ నోట్ 10 సిరీస్ మోడళ్లలో దేనినైనా కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 6,990 విలువైన గెలాక్సీ బడ్స్‌ను డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు. ఇదే కాకుండా రూ.16,530 విలువైన గెలాక్సీ యాక్టివ్ వాచ్ ను కేవలం రూ.13,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ కొన్నవారికి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పై RS.500 తగ్గింపు

గెలాక్సీ ఎస్ 10 మరియు గెలాక్సీ నోట్ 10 లపై పండుగ ఒప్పందాలు అక్టోబర్ 31 వరకు భారతదేశం అంతటా శామ్సంగ్ అవుట్లెట్ల ద్వారా లభిస్తాయి. అయితే గెలాక్సీ యాక్టివ్ వాచ్ మరియు గెలాక్సీ బడ్స్ బండిల్ ఆఫర్ కేవలం శామ్సంగ్ యొక్క ఆన్లైన్ స్టోర్ మరియు ఎంపిక చేసిన శామ్సంగ్ అవుట్లెట్లు మరియు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ మరియు టాటా CLiQ వంటి ఆన్లైన్ స్టోర్ల ద్వారా మాత్రమే లభిస్తుంది. .
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090