సామ్‌సంగ్‌కు భారీ నష్టాలు.. మరో 20 వేల కోట్ల అంచనా?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ సామ్‌సంగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్యాటరీ లోపం కారణంగా గెలాక్సీ నోట్ ఫోన్‌లు పూర్తిగా విఫలమవటంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో, భారీ నష్టాలు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Read More : పాకిస్థాన్ ఉచ్చులో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇప్పటికే 2.3 బిలియన్ డాలర్ల నష్టం

గెలాక్సీ నోట్ 7 కారణంగా ఇప్పటికే 2.3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ప్రకటించిన సామ్‌సంగ్, ఈ నష్టం విలువ మరో 3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది.

మూడో త్రైమాసికంలో...

గెలాక్సీ నోట్ 7 వైఫల్యం కారణంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంస్థకు 2.3 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని సామ్ సంగ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

రానున్న రెండు త్రైమాసిక ఫలితాల్లో..

రానున్న రెండు త్రైమాసిక ఫలితాల్లో మరో 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలు వచ్చే అవకాశముందని సామ్‌సంగ్ తాజాగా ప్రకటించింది.

25 లక్షల ఫోన్లను వెనక్కితీసుకున్న...

గెలాక్సీ నోట్ 7 ఫోన్ బ్యాటరీలు పేలుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తటంతో దాదాపు 25 లక్షల ఫోన్లను సామ్‌సంగ్ రీకాల్ చేసిన విషయం తెలిసిందే.

కొత్త ఫోన్‌లు ఇచ్చినప్పటికి...

వాటి స్థానంలో కొత్త ఫోన్‌లను ఇచ్చినప్పటికి వాటిలోనూ లోపాలు తలెత్తటంతో నోట్ 7 ఉత్పత్తులపు పూర్తి నిలిపివేస్తున్నట్లు సామ్ సంగ్ ప్రకటించింది. దీంతో అటు ఆదాయ పరంగా, ఇటు బ్రాండ్ వాల్యూ పరంగా సామ్‌సంగ్ దెబ్బతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Expects Another $3.1 Billion in Lost Income From Note 7. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot