Samsung ఎక్సినోస్ 2200 SoC చిప్ సెట్ లాంచ్ అయింది!! ప్రత్యేకతలు ఏమిటో తెలుసా??

|

స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే చిప్ సెట్ల తయారీకి క్వాల్కమ్ మరియు సామ్ సంగ్ సంస్థలు ప్రసిద్ధి చెందింది. ఇటీవల క్వాల్కమ్ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ని విడుదల చేసింది. దీనికి పోటీగా దక్షిణ కొరియా కంపెనీ Samsung Exynos 2200 సిస్టమ్-ఆన్-చిప్ (SoC) ను ఆవిష్కరించింది. AMD RDNA 2 ఆర్కిటెక్చర్ ఆధారంగా Samsung యొక్క Xclipse GPUని SoC ప్యాక్ చేస్తుంది. ఇది అప్‌గ్రేడ్ చేసిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)తో పాటు "మెరుగైన మొబైల్ ఫోన్ గేమింగ్ అనుభవాన్ని", అలాగే సోషల్ మీడియా యాప్‌లు మరియు ఫోటోగ్రఫీలో మెరుగైన అనుభవాన్ని ఎనేబుల్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం భారీగా ఉత్పత్తి చేస్తున్న Exynos 2200 SoC స్మార్ట్‌ఫోన్‌లోనే PC/ కన్సోల్ లాంటి గేమింగ్‌ను అందిస్తుందని Samsung పేర్కొంది. ఈ చిప్ లు గెలాక్సీ S22 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించనున్నట్లు భావిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Samsung

Samsung సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం Exynos 2200 4-నానోమీటర్ (nm) EUV (అతి అతినీలలోహిత లితోగ్రఫీ) ప్రక్రియపై నిర్మించబడింది. అలాగే ఇది ఆక్టా-కోర్ CPU కార్టెక్స్-X2 ఫ్లాగ్‌షిప్ కోర్‌తో ట్రై-క్లస్టర్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంటుంది. దీని పనితీరు మరియు సామర్థ్యం కోసం మూడు కార్టెక్స్-A710 పెద్ద కోర్‌లు మరియు పవర్ ఎఫిషియన్సీ కోసం నాలుగు కార్టెక్స్-A510 కోర్‌లను కలిగి ఉంటుంది. అలాగే Xclipse GPUతో SoC "మెరుగైన గ్రాఫిక్స్ & AI పనితీరు సహాయంతో మొబైల్ గేమింగ్ అనుభవాన్ని" అందిస్తుంది అని Samsung ఎలక్ట్రానిక్స్‌లో సిస్టమ్ LSI బిజినెస్ ప్రెసిడెంట్ యోంగిన్ పార్క్ చెప్పారు.

Samsung Exynos 2200 SoC

Samsung Exynos 2200 SoC యొక్క Xlcipse GPUలోని AMD RDNA 2 ఆర్కిటెక్చర్ స్మార్ట్‌ఫోన్‌లలో PC/ కన్సోల్-స్థాయి గేమింగ్ అనుభవం కోసం హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (RT) మరియు వేరియబుల్ రేట్ షేడింగ్ (VRS) వంటి ఫీచర్లను అందిస్తుంది. "అదనంగా, Xclipse GPU మొత్తం పనితీరు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచే అధునాతన మల్టీ-IP గవర్నర్ (AMIGO) వంటి వివిధ సాంకేతికతలతో వస్తుంది" అని శామ్సంగ్ తెలిపింది. శామ్‌సంగ్ ఎక్సినోస్ 2200 అనేది మార్కెట్‌లోని కొన్ని SoCలలో ఒకటి, ఇది ఎక్కువ భద్రత మరియు పనితీరు కోసం Armv9 CPU కోర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

ఎక్సినోస్
 

ఎక్సినోస్ 2200 మరింత శక్తివంతమైన ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని అప్‌గ్రేడ్ చేసిన NPUతో అందిస్తుందని దాని ముందున్న దానితో పోలిస్తే రెట్టింపు పనితీరును అందిస్తుందని దక్షిణ కొరియా కంపెనీ పేర్కొంది. ఇది సబ్-6GHz మరియు mmWave (మిల్లీమీటర్ వేవ్) స్పెక్ట్రమ్ బ్యాండ్‌లకు మద్దతు ఇచ్చే 3GPP 16 5Gని కూడా అనుసంధానిస్తుంది. ఇంకా E-UTRAN న్యూ రేడియో - డ్యూయల్ కనెక్టివిటీ (EN-DC) మోడెమ్ 10Gbps వరకు స్పీడ్ ను పెంచడానికి అనుమతిస్తుంది.

ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే శామ్సంగ్ ఎక్సినోస్ 2200 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) ఆర్కిటెక్చర్ 200-మెగాపిక్సెల్‌ల రిజల్యూషన్‌లతో కెమెరాలకు మద్దతు ఇస్తుందని క్లెయిమ్ చేయబడింది. ISP సింగిల్ కెమెరా మోడ్‌లో 30fps వద్ద 108-మెగాపిక్సెల్ మరియు డ్యూయల్ కెమెరా మోడ్‌లో 64-మెగాపిక్సెల్ + 36-మెగాపిక్సెల్ వరకు మద్దతు ఇస్తుంది. ఇది ఏడు వ్యక్తిగత ఇమేజ్ సెన్సార్‌లను కూడా కనెక్ట్ చేయగలదు మరియు అధునాతన మల్టీ-కెమెరా సెటప్‌ల కోసం ఏకకాలంలో నాలుగు డ్రైవ్ చేయగలదు. వీడియో రికార్డింగ్ కోసం ISP గరిష్టంగా 4K HDR (లేదా 8K) రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది అని శామ్సంగ్ సంస్థ తెలిపింది. శామ్సంగ్ ఎక్సినోస్ 2200 మల్టీ-ఫార్మాట్ కోడెక్ (MFC) వీడియోలను 240fps వద్ద 4K లేదా 60fps వద్ద 8K వరకు డీకోడ్ చేయగలదు. అంతేకాకుండా 120fps వద్ద 4K లేదా 30fps వద్ద 8K వరకు ఎన్‌కోడ్ చేయగలదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Exynos 2200 SoC Launched With AMD RDNA 2 Architecture: Expected to Power Galaxy S22 Series Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X