సామ్‌సంగ్ నుంచి డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్ ?

|

2017 ఆపిల్ బిగ్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ఐఫోన్‌లతో పాటు విప్లవాత్మక AirPower వైర్‌లెస్ చార్జర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తమ ఎయిర్‌పవర్ వైర్‌లెస్ ఛార్జింగ్ డివైస్ పై ఏకకాలంలో మూడూ యాపిల్ డివైస్‌లను ఛార్జ్ చేసుకోవచ్చని యాపిల్ వెల్లడించిన నేపథ్యంలో వీటి పై భారీ అంచనాలు నెలకున్నాయి.

 
సామ్‌సంగ్ నుంచి డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్ ?

వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోతోన్న ఎయిర్‌పవర్ ఛార్జర్ కోసం టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ప్రధాన రైవల్ కంపెనీ అయిన సామ్‌సంగ్ కూడా ఓ డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఛార్జర్‌కు సంబంధించిన పేటెంట్‌ను కూడా సామ్‌సంగ్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా, సామ్‌సంగ్ అభివృద్ధి చేయబోతోన్న డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సంబంధించి ఓ ఇమేజ్ బయటకొచ్చింది. ఈ ఇమేజ్ ప్రకారం చూస్తుంటే, సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సంబంధించిన ఛార్జింగ్ బెడ్ పై ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

సామ్‌సంగ్ నుంచి డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్ ?

Qi స్టాండర్డ్‌తో వచ్చే ప్రతి డివైస్‌ను సపోర్ట్ చేసే విధంగా సామ్‌సంగ్ ఈ చార్జర్‌ను బిల్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రతిధ్వని (resonance), అయస్కాంత ప్రేరణ (magnetic induction) వంటి సిద్ధాంతాలను సామ్‌సంగ్ వినియోగించకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ చార్జర్‌కు సంబంధించిన చార్జింగ్ బెడ్ పై ఏదైనా డివైస్‌ను ప్లేస్ చేసిన వెంటనే, ఆ డివైస్ ఏంటనేది గుర్తించటంతో పాటు, ఆ డివైస్ చార్జ్ అయ్యేందుకు అవసరమైన సూటబుల్ మాగ్నటిక్ చార్జింగ్ మోడ్‌ను కూడాా ఆటోమెటిక్‌గా ఈ చార్జర్ అడ్జస్ట్ చేసుకోగలుగుతుందట.

జియోని టార్గెట్ చేసిన Airtel, కౌంటర్‌కి రీకౌంటర్ !జియోని టార్గెట్ చేసిన Airtel, కౌంటర్‌కి రీకౌంటర్ !

ఆపిల్ AirPower చార్జర్‌కు పోటీగా రూపుదిద్దుకుంటోన్న ఈ డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌ను ఫిబ్రవరి 2018లో సామ్‌సంగ్ లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్లో వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇదే నెలలో సామ్‌సంగ్ తన లేటెస్ట్ ఫ్టాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్9ను లాంచ్ చేయవల్సి ఉంది. బహుశా ఈ ఫోన్‌తో పాటుగా చార్జర్‌నూ ఆవిష్కరించే అవకావం ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో వైర్‌లెస్ చార్జింగ్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఇండక్టివ్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిద్ధాంతం ఆధారంగా స్పందించే వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో పనిలేకుండా చార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఈ చార్జ్ ప్లేట్ లేదా ప్యాడ్ పై కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
The wireless charging bed from Samsung seems to charge two devices simultaneously.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X