Home
News

శామ్‌సంగ్ గెలాక్సీ A03s బడ్జెట్ ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు,ఫీచర్స్ ఇవే

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు మంచి ఆదరణను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ నేడు భారతదేశంలో బడ్జెట్-స్నేహపూర్వక ఆఫర్‌గా గెలాక్సీ A-సిరీస్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ A03s ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ SoC ద్వారా శక్తిని పొందుతూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే సెల్ఫీ కెమెరా కోసం నాచ్ మరియు అన్ని వైపులా మందపాటి బెజెల్‌లను కలిగి ఉంది. రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు మూడు కలర్ ఎంపికలతో లభించే శామ్‌సంగ్ గెలాక్సీ A03s గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A03s ధరలు & సేల్స్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A03s ధరలు & సేల్స్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A03s స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.11,499 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.12,499. ఇది బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ లలో మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది. ఇది Samsung.com, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్, అలాగే రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని కొనుగోలు సమయంలో ఐసిఐసిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్, శామ్‌సంగ్ ఫైనాన్స్+, బజాజ్ ఫైనాన్స్ లేదా టివిఎస్ ఫైనాన్సింగ్ హోల్డర్లు రూ.1000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ A03s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A03s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A03s స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు UI 3.1 కోర్ తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటీ V TFT స్క్రీన్‌ను 720x1,600 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో P35 SoC ద్వారా శక్తిని పొందుతూ 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది.

ఆప్టిక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A03s ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.2 లెన్స్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మరియు f/2.4 ఎపర్చర్ తో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో V- ఆకారపు నాచ్‌లో f/2.2 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, GPS, Bluetooth v5.0, 3.5m హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ A03s లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Samsung ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. కొలతల పరంగా, శామ్‌సంగ్ గెలాక్సీ A03s 164.2x75.9x9.1mm కొలతలు మరియు బరువు 196 గ్రాములు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A03s Budget Smartphone Released in India With MediaTek Helio P35 SoC: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X