అంచనా ధర రూ.11,000 లకే Samsung నుంచి కొత్త 5G ఫోన్ ! స్పెసిఫికేషన్ల వివరాలు.

By Maheswara
|

Samsung భారతదేశంలో తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలకే 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు కంపెనీ ఇటీవలే ప్లాన్ చేస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో భారతదేశంలో 5G సేవల ను పరిచయం చేయనున్నారు. కాబట్టి చాలా సెల్ ఫోన్ కంపెనీలు బడ్జెట్ ధరలలో 5G స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నాయి.

 

5G ఫోన్లు ప్రత్యేకం

5G ఫోన్లు ప్రత్యేకం

ముఖ్యంగా Oppo, Realme, Moto, Infinix వంటి కంపెనీలు ఇప్పటికే బడ్జెట్ ధరలలో మరిన్ని 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. బడ్జెట్ ధరల్లో 5జీ ఫోన్లను విడుదల చేసేందుకు శాంసంగ్ కూడా ఆసక్తిగా ఉందనే చెప్పాలి.

Samsung Galaxy A04S 5G

Samsung Galaxy A04S 5G

Geekbench సైట్‌లో ప్రచురించిన సమాచారం ప్రకారం, Samsung సంస్థ Samsung Galaxy A04s 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,000 లోపు ధర తో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని సమాచారం విడుదలైంది.అలాగే, ఈ కొత్త Samsung Galaxy A04S 5G స్మార్ట్‌ఫోన్ Exynos 850 ప్రాసెసర్‌తో అమర్చబడిందని నివేదిక లో చెప్పబడింది. మరియు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

64GB ఇంటర్నల్ స్టోరేజీ
 

64GB ఇంటర్నల్ స్టోరేజీ

Samsung Galaxy A04S 5G ఫోన్‌కు 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీ మద్దతునిస్తుంది. ఈ Galaxy A04S 5G స్మార్ట్‌ఫోన్ USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.

Galaxy A04S 5G కెమెరా వివరాలు

Galaxy A04S 5G కెమెరా వివరాలు

ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం ప్రకారం, Galaxy A04S 5G ఫోన్‌లో 13MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ కెమెరా + 2MP మాక్రో కెమెరా తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ Samsung ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాతో వస్తుందని సమాచారం.ఈ Galaxy A04S 5G స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా భారతీయ మార్కెట్లో చాలా అంచనాలను సృష్టించింది. మరియు కంపెనీ ఇప్పటికే పరిచయం చేసిన Samsung Galaxy M13 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల వివరాలను ను కూడా ఒకసారి తెలుసుకుందాం.

Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12.0-ఆధారిత One UI 4తో రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో లభిస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCతో రన్ అవుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. శామ్సంగ్ RAM ప్లస్ ఫీచర్‌తో RAMని 12GB వరకు పొడిగించుకోవచ్చు. ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M13 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం

సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం

సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, 5G (11 5G బ్యాండ్‌లు) మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది Samsung నాక్స్ సెక్యూరిటీ సూట్‌తో వస్తుంది.

భారతదేశంలో గెలాక్సీ M13 5G ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.

4G వెర్షన్ కూడా లాంచ్

4G వెర్షన్ కూడా లాంచ్

Samsung Galaxy M13 సిరీస్ లోనే 5G వెర్షన్ కాక 4G వెర్షన్ కూడా లాంచ్ అయింది. ఇప్పుడు Samsung Galaxy M13 సిరీస్ లో 4G యొక్క వెర్షన్ గురించి తెలుసుకుందాం.గెలాక్సీ M13 మోడల్ కూడా రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999 ధర వద్ద ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ మరియు స్టార్‌డస్ట్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. ఈ గెలాక్సీ రెండు మోడల్ ఫోన్లు జూలై 23 నుండి Samsung.com, Amazon మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

శామ్సంగ్ గెలాక్సీ M13 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12.0-ఆధారిత One UI 4 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ LCD డిస్‌ప్లేను 480 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అందిస్తుంది. ఇది హుడ్ కింద Exynos 850 SoC ద్వారా శక్తిని పొందుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. Samsung RAM ప్లస్ ఫీచర్‌తో RAMని 12GB వరకు పొడిగించుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy A04s 5G Is Expected To Launch Soon. Expected Price Was Under Rs.11000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X