Home
News

Samsung నుంచి రాబోతోన్న కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు చూడండి.

By Maheswara

Samsung నుంచి తర్వాత లాంచ్ కాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి.ఈ ఫోన్ Samsung Galaxy A04s పేరు తో ఎంట్రీ-లెవల్ ఫోన్‌ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Winfuture.de ద్వారా వచ్చిన కొత్త లీక్ ప్రకారం ఈ సమాచారం తెలిసింది. ఈ స్మార్ట్ ఫోన్ 90Hz డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు పెద్ద బ్యాటరీ వంటి కీలక ఫీచర్లను అందిస్తుందని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం A04s యొక్క రెండర్‌లు మరియు ధర కూడా లీక్ అయ్యాయి.ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయవచ్చని కూడా నివేదిక పేర్కొంది.

Samsung Galaxy A04s లీక్ అయిన అంచనా స్పెసిఫికేషన్లు

Samsung Galaxy A04s లీక్ అయిన అంచనా స్పెసిఫికేషన్లు

ఫోన్ యొక్క ముందు డిజైన్ ను చూస్తే , Galaxy A04s టియర్‌డ్రాప్ నాచ్‌తో 6.5-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను తీసుకువస్తుంది.

Exynos 850 చిప్‌సెట్

Exynos 850 చిప్‌సెట్

Samsung ద్వారా వచ్చే  Exynos 850 చిప్‌సెట్, ఈ Galaxy A04s స్మార్ట్ ఫోన్లో వస్తుంది. ఈ ఫోన్  3 GB RAM, 32 GB స్టోరేజీ మరియు అదనపు స్టోరేజీ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS తో ముందుగా లోడ్ చేయబడి, Samsung యొక్క వన్ UIతో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే

కెమెరా విషయానికి వస్తే

ఇక కెమెరా విషయానికి వస్తే సెల్ఫీల కోసం, Galaxy A04s స్మార్ట్ ఫోన్లో వినియోగదారులకు 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది. అలాగే, వెనుక వైపు f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ని కలిగి ఉంటుంది. ఇది డెప్త్ మరియు మాక్రో షాట్‌ల కోసం ఒక జత 2-మెగాపిక్సెల్ కెమెరాలతో కూడా వస్తుంది.

బ్యాటరీ

బ్యాటరీ

ఈ Galaxy A04s  స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా, USB-C  పోర్ట్ , స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.x, NFC మరియు 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను అందిస్తుంది.

Samsung Galaxy A04s అంచనా ధర

Samsung Galaxy A04s అంచనా ధర

ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం ఐరోపా యొక్క ధరలు లీక్ అయ్యాయి. Galaxy A04s ధర యూరప్ లో 169 యూరోలు ఉంటుందని అంచనా. మరియు ఈ ఫోన్ తెలుపు, నలుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ మరియు ధరల వివరాలపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

Galaxy A53 5G ఫోన్ పై ఇండియా లో ధరలు తగ్గించింది

Galaxy A53 5G ఫోన్ పై ఇండియా లో ధరలు తగ్గించింది

ఇది ఇలా ఉండగా ఇటీవలే Samsung తన మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్ అయిన Galaxy A53 5G ఫోన్ పై ఇండియా లో ధరలు తగ్గించింది.Samsung Galaxy A53 5G స్మార్ట్ ఫోన్ పై భారత దేశంలో ఇప్పుడు ధర ₹3,000 చౌకగా లభిస్తుంది. ఇంకా ,ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ₹31,999 గా ఉంది. ఒక్కసారి గుర్తుచేసుకుంటే, Samsung Galaxy A53 5Gని Samsung Galaxy A33 5Gతో పాటు ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్  రెండు RAM మోడల్‌లను కలిగి ఉంది- 6GB మరియు 8GB. విడుదల చేసినప్పుడు 6GB RAM ఫోన్ ₹34,999 వద్ద ప్రారంభించబడింది. ఆఫర్ ధర తగ్గింపు తర్వాత, దీనిని ఇప్పుడు ₹31,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, 8GB RAM వేరియంట్ దాని అసలు ధర ₹35,999పై ₹3,000 తగ్గిన తర్వాత ఇప్పుడు ₹32,999 కి లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగులలో అందించబడుతుంది. అవి Awesome Black, Awesome Blue, Awesome Peach మరియు Awesome White.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A04s Expected To Launch Soon. Price, Specification And Renders Leaked Online.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X