Samsung నుంచి కొత్త స్మా్ర్ట్‌ఫోన్.. ధర, ర్యామ్, స్టోరేజీ వివరాలు
ప్రముఖ స్మా్ర్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ కొన్ని దేశాల్లో ఇటీవల విడుదల అయింది. త్వరలో భారత్‌లోనూ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G85 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
అయితే తాజాగా ఈ శాంసంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ మాన్యువల్.. శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మరియు 2 RAM, స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A05 ధర వివరాలు : గెలాక్సీ A05 స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. క్రోమా వెబ్‌సైట్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ ధర రూ.12499గా ఉంది.
అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999గా ఉంది. అయితే శాంసంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ త్వరలో అధికారిక వెబ్‌సైట్ సహా ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో వెల్లడికాలేదు.

శాంసంగ్ గెలాక్సీ A05 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ స్మా్ర్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ ( 1600*720 పిక్సల్ ) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 60Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G85 SoCతో Mail G52 GPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
మరియు శాంసంగ్ గెలాక్సీ A05 ఫోన్ 6 GB LPDDR4X ర్యామ్ వరకు మరియు 128 GB eMMC 5.1 అంతర్గత స్టోరేజీతో జత చేయబడుతుంది. మరియు మైక్రో SD కార్డు సాయంతో 1 TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OneUI 5.1 ఆధారంగా పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు LED ప్లాష్‌లైట్‌తో వస్తుంది. మరియు ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. ముందువైపు వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈఫోన్ 4G, వైఫై 802.11, బ్లూటూత్ 5.3, USB 2.0, GPSను సపోర్టు చేస్తుంది. మరియు USB-C ఛార్జర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3.5 ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








