Home
News

6GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు

శాంసంగ్‌ ఇటీవల కాలంలో తన పాత మోడల్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గిస్తోంది. తాజాగా ఈ సంస్థ గత సంవత్సరం నవంబర్‌లో విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A05 Smartphone) ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ మరియు HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ చిప్‌సెట్‌పై పనిచేస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A05 Price drop) 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 260 PPI తో 16M కలర్స్‌తో వస్తుంది.

Samsung Galaxy A05 Smartphone price cut

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత శాంసంగ్‌ One UI core layer పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 6GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీ పెంచుకోనే వీలుంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ కెమెరా ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం రూ.12499 కు లాంచ్‌ అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ధరను రూ.1,500 తగ్గించింది. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

రేపు శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ విడుదల : దీంతోపాటు శాంసంగ్‌ తన కొత్త F సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ గెలాక్సీ F15 5Gను రేపు (మార్చి 4) మధ్యాహ్నం 12PM గంటలకు లాంచ్‌ చేయనుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్టు ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ 4 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చని శాంసంగ్‌ వెల్లడించింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది. వెనుకపైపు 50MP ప్రైమరీ కెమెరా సహా 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఈ ఫోన్‌ 4GB లేదా 6GB ర్యామ్‌ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A05 Smartphone attracts with price drop in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X