Home
News

Samsung గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో గత నెలలో విడుదల అయింది. అయితే అప్పట్లో కొన్ని వేరియంట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా శాంసంగ్‌ సంస్థ ఈ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ విడుదల అయింది.

మూడు రంగులు : శాంసంగ్‌ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12,499గా ఉంది. ఈ ఫోన్‌ లైట్‌ గ్రీన్‌, లైట్‌ వైలెట్‌ సహా బ్లాక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.14,999కు కొనుగోలు చేయవచ్చు.

Samsung galaxy A05s 4GB RAM variant

ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్‌బ్యాక్‌ వస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్‌ను EMI ఆప్షన్‌ ద్వారాను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ ఫైనాన్స్‌+, బ్యాంక్‌ మరియు NBFC ఆప్షన్ ద్వారాను కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.1150 EMI చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది.

శాంసంగ్‌ గెలాక్సీ A05s స్పెసిఫికేషన్లు : ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ ఫోన్‌ 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

Samsung galaxy A05s 4GB RAM variant

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు 6.7 అంగుళాల FHD+ తో 1080*2400 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌, f/2.4 అపేచర్‌తో 2MP మాక్రో కెమెరాతో వస్తుంది. దాంతోపాటు ఈ ఫోన్ ముందువైపు f/2.0 అపేచర్‌తో 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

రెండు రోజులపాటు బ్యాటరీ ఛార్జింగ్‌! : ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌లో ఈ బ్యాటరీ లైఫ్‌ రెండు రోజులపాటు వస్తుందని శాంసంగ్‌ సంస్థ చెబుతోంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే శాంసంగ్‌ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్‌ కార్డును సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 3G, 4G, VoLTE నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. వైఫై సహా భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ పింగ్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy A05s smartphone 4GB RAM variant launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X