Samsung నుంచి కొత్త బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ A05s (Samsung Galaxy A05s) స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 18న విడుదల కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15000 రూపాయల సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సహా LED ఫ్లాష్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెంటర్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ప్యానల్‌తోపాటు గుర్తించిదగిన స్థాయిలో బెజిల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ A05s ఊహించిన స్పెసిఫికేషన్లు : టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung New 5G Smartphone) 6.7 అంగుళాల FHD+ PLS LDC డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. అండర్ ది హుడ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో వస్తుందని తెలుస్తోంది. 12GB వరకు వర్చువల్‌గా ర్యామ్ పెంచుకొనే అవకాశం ఉంటుందని సమాచారం.
ఈ ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉన్న మైక్రో SD కార్డు స్లాట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కస్టమ్ OneUI 5.1 పైన పనిచేయనుంది. ఈ శాంసంగ్ కొత్త ఫోన్ పవర్, వాల్యూమ్ బట్లన్లు కుడివైపున ఉండే అవకాశం ఉంది. ఎడమవైపున సిమ్ ట్రేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, మరియు 4 సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని వెల్లడించే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా సహా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందువైపు 13MP కెమెరా ఉంటుందని సమాచారం.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ ధర రూ.15000 సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ లైమ్ గ్రీన్, గ్రాఫైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అయితే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. 15000 రూపాయల్లోపు 5G స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ A05s ఫోన్‌ను పరిశీలించవచ్చు. అక్టోబర్ 18న ఈ ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








