50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Samsung స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. సేల్ వివరాలు..!
శాంసంగ్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గిస్తోంది. తాజాగా ఈ సంస్థ శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ ( Samsung Galaxy A05s Smartphone ) ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పుల్ HD+ డిస్‌ప్లే సహా క్వాల్‌కాం చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
రూ.2000 ధర తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్ ఫోన్ 2023 అక్టోబర్‌లో లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. తాజాగా ఈ ఫోన్ ధరను రూ.2000 తగ్గిస్తూ శాంసంగ్ ( Samsung Smartphone Price cut ) నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A05s స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1080*2400 రిజల్యూషన్‌తో 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు ఛార్జింగ్ ఉంటుందని శాంసంగ్ చెబుతోంది.
శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 680 చిప్‌సెట్ 6GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీ తో జతచేయబడుతుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A05s కెమెరాలు : శాంసంగ్ గెలాక్సీ A05s స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్, f/2.4 అపేచర్‌తో 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. f/2.0 అపేచర్‌తో 13MP ముందు కెమెరాను కలిగి ఉంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ : భద్రత కోసం ఈ స్మార్ట్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. GPS, GLONASS, వైఫై 802.11, బ్లూటూత్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వైలెట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications