Samsung గెలాక్సీ A12, M02s, F02s స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి!! కొత్త ధరలు ఇవే

|

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ప్రతి సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి. శామ్సంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. షియోమి మరియు ఒప్పో సంస్థలు ఇటీవల ఇండియాలోని తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచాయి. శామ్సంగ్ సంస్థ కూడా ఇప్పుడు అదే తరహాలో తన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచింది.

 

గెలాక్సీ

అందులో భాగంగా గెలాక్సీ A12, గెలాక్సీ M02, గెలాక్సీ F02s యొక్క ధరలను కంపెనీ పెంచింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల ధరల మీద కంపెనీ రూ.500 వరకు పెంచింది. వీటి కొత్త ధరలు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రొత్త ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరల వివరాలు
 

శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరల వివరాలు

** శామ్‌సంగ్ సంస్థ తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచిన తరువాత కొత్త ధరల విషయానికి వస్తే శామ్‌సంగ్ గెలాక్సీ A12 ఫోన్ యొక్క కొత్త ధరలు ఇప్పుడు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌ వేరియంట్ కు రూ.13,499 కాగా 4GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.14,499 గా ఉంది. అంతకుముందు వీటి ధరలు వరుసగా రూ.12,999 మరియు రూ.13,999 గా ఉన్నాయి.

** కొత్తగా ధరల పెరుగుదలను అందుకున్న మరొక ఫోన్ గెలాక్సీ M02s యొక్క కొత్త ధరల విషయానికి వస్తే 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.9,499 ధరను మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.10,499 ధరను కలిగి ఉన్నాయి.


** గెలాక్సీ F02s కొత్త ధరల విషయానికొస్తే దీని ధర 3GB / 32GB మరియు 4GB / 64GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.9,499 మరియు రూ.10,499 గా ఉన్నాయి.

SBI యూజర్లు జాగ్రత్త!! ఇలాంటి మెసేజ్ వచ్చిందా?? అస్సలు నమ్మకండి...SBI యూజర్లు జాగ్రత్త!! ఇలాంటి మెసేజ్ వచ్చిందా?? అస్సలు నమ్మకండి...

శామ్సంగ్ గెలాక్సీ M02s  స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M02s స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M02s ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మెరుగైన వీక్షణ అనుభవం కోసం 6.5 అంగుళాల HD + ఇన్ఫినిటీ V డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతి ఉంది. శామ్సంగ్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లల్లో ఒకటి బ్యాటరీ. ఇది 5000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ A12 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ A12 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ సంస్థ నుండి వచ్చినకొత్త ఫోన్ గెలాక్సీ A12 ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను జాబితా చేయబడి ఉంటుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 1TB సామర్థ్యం వరకు విస్తరించవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A12, M02s, F02s Prices Hicked in India: New Prices Full Details are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X