శామ్సంగ్ గెలాక్సీ అబిమానులకు శుభవార్త
స్మార్ట్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇప్పుడు మరొక రెండు మొబైల్లపై ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం శామ్సంగ్ కంపెనీ తన శామ్సంగ్ గెలాక్సీA20, శామ్సంగ్ గెలాక్సీA30 రెండు మొబైల్ ధరలను తగ్గించింది.ఈ రెండు మొబైల్లకు శాశ్వత ధర తగ్గింపును మోడల్ ఆధారంగా రూ .1,500 వరకు తగ్గించారు. ఈ చర్య ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత రెండు డివైస్లు మార్కెట్లో పోటీ పడుతుందని నిర్ధారించడానికి అవకాశం ఉంది.

నివేదిక ప్రకారం శామ్సంగ్ గెలాక్సీA20 1000రూపాయల తగ్గింపు తరువాత ఇప్పుడు రూ.10,490 వద్ద మరియు శ్యామ్సంగ్ గెలాక్సీ A30 1500రూపాయల తగ్గింపు ధర ఇప్పుడు రూ.13,999లకు అమ్మకాలు జరుగుతున్నాయి.

ధర అమలు స్థలాలు:
ధర తగ్గింపు ఇప్పటికే శామ్సంగ్ ఆఫ్లైన్ దుకాణాల్లో అమలులో ఉంది. కానీ శామ్సంగ్ ఆన్ లైన్ స్టోర్ మరియు అమెజాన్ ఇండియాలలో ఇంకా ధర తగ్గింపులను అప్డేట్ చేయలేదు.ఈ రెండు మొబైళ్లు అందుకున్న మొదటి ధర తగ్గింపు ఇది కాదని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. గతంలో నివేదించినట్లుగా కంపెనీ ఈ రెండు మొబైల్ ధరలను గత నెలలో రూ.1,500 వరకు తగ్గించింది. ఈ ధర తగ్గింపు శామ్సంగ్ మార్కెట్లో రెండు పరికరాలను ప్రారంభించిన ఒక నెల తర్వాత వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీA20 స్పెసిఫికేషన్స్:
శామ్సంగ్ గెలాక్సీA20 19.5: 9 కారక నిష్పత్తితో, HD + స్పష్టత మరియు నాచ్ తో 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే ను అందిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ Exynos 7884 SoC తో నడుస్తుంది.ఇది ఆక్టా-కోర్ CPU తో పాటు 3GB RAM మరియు 32GBఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంటుంది.ఈ శామ్సంగ్ గెలాక్సీA20 ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కోసం బ్యాక్ సైడ్ 13-మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో జతచేయబడి ఉంటుంది.సెల్ఫీస్ కోసం ముందువైపు 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఇది 3.5mm ఆడియో సాకెట్, బ్లూటూత్ v5.0, Wi-Fi, GPS, NFC, FM రేడియో, USB టైప్-సి, మరియు 4G VoLTE డ్యూయల్ నానో-సిమ్ తో వస్తుంది. చివరగా ఈ మొబైల్ 15W వేగవంతమైన ఛార్జింగ్ తో 4000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీA30 స్పెసిఫికేషన్స్:
శామ్సంగ్ గెలాక్సీA30 19.5: 9 కారక నిష్పత్తితో, FHD + స్పష్టత మరియు నాచ్ తో 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే ను అందిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ Exynos 7904 SoC తో నడుస్తుంది.ఇది ఆక్టా-కోర్ CPU తో పాటు 4GB RAM మరియు 64GBఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంటుంది.ఈ శామ్సంగ్ గెలాక్సీA30 ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కోసం బ్యాక్ సైడ్ 16-మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో జతచేయబడి ఉంటుంది.సెల్ఫీస్ కోసం ముందువైపు 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఇది 3.5mm ఆడియో సాకెట్, బ్లూటూత్ v5.0, Wi-Fi, GPS, NFC, FM రేడియో, USB టైప్-సి, మరియు 4G VoLTE డ్యూయల్ నానో-సిమ్ తో వస్తుంది. చివరగా ఈ మొబైల్ 15W వేగవంతమైన ఛార్జింగ్ తో 4000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్స్
ఈ రెండు మొబైల్ లు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజిను విస్తరించడానికి వీలు ఉంటుంది మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎంపికలతో వస్తాయి. ఇక్కడ గమనించవలసిన చివరి విషయం ఏమిటంటే ఈ రెండు మొబైల్ లు ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత శామ్సంగ్ One UI తో నడుస్తాయి.


Click it and Unblock the Notifications








