Home
News

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవిగో...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్ తన యొక్క సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ని నేడు భారతదేశంలో విడుదల చేశారు. ట్రిపుల్ రియర్ కెమెరా, 90HZ డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ డిస్ప్లే, 8GB ర్యామ్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు వైర్డు మరియు వైర్‌లెస్ హెడ్‌సెట్లతో డాల్బీ అట్మోస్ ఆడియో ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రియల్‌మి X7 5G, మరియు ఐక్యూ Z3 లకు గట్టిపోటీని ఇస్తున్నది. శామ్సంగ్ గెలాక్సీ A22 5G ఫోన్ మొదట ఐరోపాలో గత నెలలో గెలాక్సీ A22 4G తో పాటు లాంచ్ అయింది.

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.19,999 కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర రూ.21,999. ఇది గ్రే, మింట్ మరియు వైలెట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది జూలై 25 నుండి వివిధ రిటైల్ దుకాణాల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఈ రోజు అర్ధరాత్రి నుండి శామ్సంగ్.కామ్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కూడా అమ్మకానికి వెళ్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G లాంచ్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G లాంచ్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G యొక్క లాంచ్ ఆఫర్‌లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అలాగే వివిధ బ్యాంకింగ్ మరియు ఎన్‌బిఎఫ్‌సి భాగస్వాముల ద్వారా EMI ఎంపికలు కూడా ఉన్నాయి. ఇండియాలో గత నెలలో శామ్సంగ్ గెలాక్సీ A22 యొక్క 4G వేరియంట్‌ను ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లతో రూ.18,499 ధర వద్ద లాంచ్ చేసారు.

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో వన్ UI కోర్ 3.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి + ఇన్ఫినిటీ-వి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో పాటు 8GB వరకు ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G ఆప్టిక్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్రైమరీ కెమెరాతో పాటుగా 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌

శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G స్మార్ట్‌ఫోన్ 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో గల మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 1TB వరకు కూడా విస్తరించబడుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 15W ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 167.2x76.4x9mm కొలతల పరిమాణంతో 203 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A22 5G Smartphone Released in India: Price, Specs, Features, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X